Begin typing your search above and press return to search.

కేసీఆర్ ప‌ద్మ సిఫార్సుల్సి లైట్ తీసుకున్న మోడీ!

By:  Tupaki Desk   |   26 Jan 2019 5:33 AM GMT
కేసీఆర్ ప‌ద్మ సిఫార్సుల్సి లైట్ తీసుకున్న మోడీ!
X
స్నేహం స్నేహ‌మే. లెక్క‌లు లెక్క‌లే. ఎక్క‌డైనా బావ కానీ వంగ‌తోట ద‌గ్గ‌ర మాత్రం కాద‌న్న విష‌యాన్ని మోడీ ఇప్ప‌టికే ప‌లుమార్లు త‌న చేత‌ల‌తో స్ప‌ష్టం చేస్తుంటారు. మిత్రుల విష‌యంలోనూ ఆయ‌న క‌ర‌కుగానే వ్య‌వ‌హ‌రిస్తారు. అస‌లు సిస‌లు మార్వాడీ వ్యాపారి త‌ర‌హాలో ఉండే మోడీ.. త‌న‌కు వ‌చ్చేది.. తాను ఇచ్చేది ఎంత‌న్న విష‌యంలో స్ప‌ష్టంగా ఉండ‌ట‌మే కాదు.. త‌న‌ను ఎవ‌రూ ప్ర‌భావితం చేయ‌లేర‌ని.. కొన్నింటి నిర్ణ‌యాల్లో తాను అనుకున్న‌ది మాత్ర‌మే జ‌ర‌గాల‌న్న ఆలోచ‌న కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తూ ఉంటుంది.

తాజాగా ప్ర‌క‌టించిన ప‌ద్మ పుర‌స్కారాల జాబితాను చూస్తే.. ప్ర‌తి ఒక్క‌రి ఎంపిక‌లోనూ త‌మ‌దైన ముద్ర ఉండేలా నిర్ణ‌యం తీసుకున్నారు. తాను స్నేహంగా ఉండే కేసీఆర్ స‌ర్కారు పంపిన ప్ర‌తిపాద‌న‌ల్ని లైట్ తీసుకోవ‌టం ద్వారా మోడీ స‌ర్కారు రూటే స‌ప‌రేటు అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పాలి.

ప‌ద్మ పుర‌స్కారాల కోసం భారీ లిస్ట్ పంపిన తెలంగాణ ప్ర‌భుత్వానికి నిరాశే మిగిలింది. గ‌త సెప్టెంబ‌రులో 15 మందితో కూడిన జాబితాను తెలంగాణ ప్ర‌భుత్వం కేంద్రానికి పంపితే.. అత్య‌ధికుల్ని ప‌క్క‌న పెట్టేసింది. నృత్య విభాగంలో ఆనంద శంక‌ర్ జ‌యంతి.. ప‌రిశ్ర‌మ‌ల విభాగంలో హైద‌రాబాద్‌కు చెందిన శంత‌ను నారాయ‌ణ్ ల‌కు ప్ర‌ద్మ‌భూష‌ణ్ లు ఇవ్వాల‌ని కోర‌గా నారాయ‌ణ్ కు మాత్రం ఎన్ ఆర్ ఐ కోటాలో ప‌ద్మ‌శ్రీ ద‌క్కింది.

ఇక ప‌ద్మ‌శ్రీ విభాగంలో ఎన్. గోపి.. ర‌వ్వా శ్రీ‌హ‌రి (సాహిత్యం).. జ‌య‌ప్ర‌ద రామ‌మూర‌తి.. గ‌డ్డం స‌మ్మ‌య్య‌.. బొంగు న‌ర్సింగ‌రావు.. దారూరి శేషాచారి-రాఘ‌వాచారి.. కంద‌గ‌ట్ల న‌ర్సింహులు.. గుత్తా మ‌ధుసూద‌న్ రెడ్డి.. వార్సి సోద‌రులు.. న‌జీర్ అహ్మ‌ద్ ఖాన్.. న‌సీర్ అహ్మ‌ద్ ఖాన్ (క‌ళ‌లు).. మండేలా పాండురంగారావు (చ‌రిత్ర‌-వార‌స‌త్వ ప‌రిర‌క్ష‌ణ‌) .. వీఎల్ ఎన్ రెడ్డి (ప‌రిశ్ర‌మ‌లు) స‌రోజ్ బ‌జాజ్.. బూసాని బాబురావు వ‌ర్మ (సంఘ‌సేవ‌) పేర్ల‌ను సిఫార్సు చేయ‌గా.. వారికి నిరాశే మిగిలింది. గ‌డిచిన ఐదేళ్ల‌లో కేసీఆర్ స‌ర్కారు పంపిన సిఫార్సుల్ని ప‌ట్టించుకోని మోడీ స‌ర్కారు.. ఈసారి కూడా అదే తీరును ప్ర‌ద‌ర్శించ‌టం గ‌మ‌నార్హం.