Begin typing your search above and press return to search.
మోడీ నోట అభినందన్ మాట.. ఎందుకంటే?
By: Tupaki Desk | 28 Feb 2019 8:28 AM GMTవింగ్ కమాండర్ అభినందన్ వర్ధన్ చేసిన సాహసం బయటకు రావటం.. దానిపై పూర్తిగా అవగాహన వచ్చిన నాటి నుంచి అతడిపైన దేశ ప్రజలకు ప్రేమ అంతకంతకూ పెరిగిపోతోంది. నిన్నటివరకూ అభినందన్ ను పాక్ కు చిక్కిన పైలట్ గా చూసిన వారు సైతం.. తాజాగా మాత్రం అతని వీరత్వాన్ని కథలు.. కథలుగా చెప్పుకుంటున్నారు.
సామాన్యుల మొదలు దేశ ప్రధాని వరకూ తమ మాటల్లో అభినందన్ ప్రస్తావనను తెస్తున్నారు. కొద్ది సేపటి క్రితం టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ట్వీట్ చేసి.. అందులో అభినందన్ సాహసానికి సెల్యూట్ చేస్తూ ట్వీట్ చేశారు. మరోవైపు ప్రధాని మోడీ తాజాగా మాట్లాడుతూ.. పైలట్ ప్రస్తావనను తీసుకొచ్చారు.
పాకిస్థాన్ చెబుతున్న మాటల్ని విపక్షాలు నమ్మొద్దన్న ప్రధాని.. ఈ సందర్భంగా అభినందన్ ప్రస్తావన తెచ్చారు. వింగ్ కమాండర్ అభినందన్ లా ధైర్యంగా నిలబడాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు. పాక్ కుట్రల్ని బయట పెట్టాలన్న ఆయన.. సరిహద్దుల్లో భారత జవాన్ల సేవల్ని కొనియాడారు.
పాకిస్థాన్ పై ఐకమత్యంతో పోరాడి విజయం సాధిస్తామన్న ఆయన.. భారత నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలని పాక్ భావిస్తోందని మండిపడ్డారు. భారత సైన్యానికి మద్దతుగా అందరూ నిలవాలన్న ఆయన భారత శక్తిని ఎవరూ ఆపలేరన్నారు. మరి.. ప్రధాని వ్యాఖ్యలపై విపక్షాల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.