Begin typing your search above and press return to search.
అంత ప్రేమ ఉంటే ఇలా చేయరాదా మోడీజీ!
By: Tupaki Desk | 7 Feb 2018 4:31 PM ISTప్రధానమంత్రి నరేంద్రమోడీ లోక్ సభలో బుధవారం నాడు అచ్చంగా గంట పాటు జరిగిన తన సుదీర్ఘ ప్రసంగంలో మెజారిటీ సమయాన్ని ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యాన్ని కీర్తించడానికి కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి - ఆంధ్రులకు కాంగ్రెస్ పార్టీ తొలినుంచి అన్యాయం చేస్తూనే వచ్చిందని, అవమానిస్తూనే వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు. ఇందుకు ఆయన చాలా దృష్టాంతాలను పేర్కొన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఏయేరకంగా కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బకొట్టిందో ఆయన చాలా చక్కగా చెప్పారు. అయితే ఇక్కడ ప్రజల కోరిక ఏంటంటే.. మోడీ నుంచి ఇలాంటి చరిత్ర పాఠాలను ప్రజలు కోరుకోవడం లేదు. కాంగ్రెస్ ఏం మోసం చేసిందో ఇక్కడి ప్రజలకు తెలుసు. అయితే వారి కోరిక.. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి మోడీ ఏం చేయబోతున్నారన్నదే!
తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టారని కొన్ని ఉదాహరణలు చెప్పారు మోడీ. దళిత సీఎం అంజయ్యను - అప్పట్లో రాజీవ్ గాంధీ హైదరాబాదులోనే తీవ్రంగా అవమానించారని పేర్కొన్నారు. నీలం సంజీవ రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీనే అధికారికంగా రాష్ట్రపతి పదవికి ప్రకటించి - రాత్రికి రాత్రే వెన్నుపోటు పొడిచి.. పార్టీ అధికారిక అభ్యర్థినే ఓడించారని.. తెలుగువాడు కనుకనే ఇలాంటి ద్రోహం చేశారని వివరించారు. ఇలాంటి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన సంఘటనల వల్లనే అప్పట్లో నందమూరి తారక రామారావు.. సినిమా హీరోగా తన జీవితాన్ని విడిచిపెట్టి తెలుగుదేశం పార్టీని స్థాపించి.. అధికారంలోకి వచ్చారని మోడీ గుర్తుచేశారు.
దేశానికి ప్రధానిగా సేవలందించిన తెలుగువ్యక్తి పివి నరసింహారావు మరణిస్తే.. భౌతికకాయాన్ని హైదరాబాదుకు పంపేసి అవమానించారని మోడీ అన్నారు. నిజమే అవమానాలు మాకు తెలుసు. మరి మోడీజీ మీరు ఆంధ్రుల కోసం ఆ అవమానాల్ని చక్కదిద్దే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అనేది ప్రజల వాంఛ. ఢిల్లీలో సమాధి లేని ఏకైక ప్రధాని పీవీ నరసింహారావు మాత్రమే. ఇప్పటికైనా మీరు ప్రధాని పీవీ నరసింహారావు పేరుతో ఢిల్లీలో ఒక మెమోరియల్ నిర్మించగలరా? తెలుగు రాష్ట్రానికి నిధులు ఇవ్వాలంటే మీకు మనసు అంగీకరించకపోవచ్చు.. కనీసం దేశాన్ని కొత్తదిశవైపు నడిపించిన ఒక అపూర్వమైన ప్రధానమంత్రికి ఈ దేశ రాజధానిలో ఒక మెమోరియల్ నిర్మించడం ద్వారా తెలుగువారి ఆత్మగౌరవాన్ని సత్కరించే ప్రయత్నం మీరేమైనా చేయగలరా? అని ప్రజలు అడుగుతున్నారు. లేదా ఉత్తుత్తి పసలేని పనికిరాని ప్రసంగాలతో పొద్దుపుచ్చడమేనా.. కాంగ్రెస్ వల్ల నష్టపోయిన తెలుగుజాతికి మీరో కొత్త భరోసాగా నిలిచే ప్రయత్నం ఏమైనా చేస్తారా అని వారు కోరుతున్నారు. మరి ఇలాంటి ప్రజల ఆకాంక్షలను మోడీ వినిపించుకుంటారా అనేది వేచిచూడాలి.