Begin typing your search above and press return to search.

కేటీఆర్ మాట‌ల‌తో తెలంగాణ‌కు మోడీ

By:  Tupaki Desk   |   6 Jan 2016 4:08 AM GMT
కేటీఆర్ మాట‌ల‌తో తెలంగాణ‌కు మోడీ
X
ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ‌కు రానున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు భార‌తీయ జ‌న‌తాపార్టీ ప్రచార క‌మిటీ చైర్మ‌న్‌ గా ఎన్నిక‌యిన వెంట‌నే న‌రేంద్ర మోడీ త‌న మొట్ట‌మొద‌టి బ‌హిరంగ స‌భ‌ను హైద‌రాబాద్‌ లోనే నిర్వ‌హించారు. ఎన్నిక‌ల్లో నెగ్గి అనంత‌రం ప్ర‌ధాన‌మంత్రి ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత మోడీ తెలంగాణ‌లో అడుగుపెట్ట‌లేదు. కానీ అతి త్వ‌ర‌లో ఆయ‌న తెలంగాణ‌లో ప‌ర్య‌టించనున్నారు. ఇటీవ‌లే మంత్రి కేటీఆర్ #తెలంగాణ రాష్ర్టం భార‌త‌దేశంలో లేదా? ప‌ద్దెనిమిది నెల‌ల కాలంలో మోడీకి మా రాష్ర్టానికి వ‌చ్చేందుకు తీరిక దొర‌క‌లేదా?# అని ప్ర‌శ్నించ‌డం వ‌ల్లో లేక‌పోతే...త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో బీజేపీ ఏర్పాటుచేసిన స‌భ‌ల్లో పాల్గొనేందుకో లేదా తెలంగాణ‌కు ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించడం కోస‌మో న‌రేంద్ర‌మోడీ తెలంగాణ గ‌డ్డ‌కు రావ‌డం లేదు.

తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్ జిల్లాకు మోడీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రెండు వ‌రాలు ఇచ్చింది. ఒక‌టి ఎన్టీపీసీ విద్యుత్ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యాన్ని పెంచ‌డం, రెండోది రామ‌గుండం ఫెర్టిలైజ‌ర్ కార్పొరేష‌న్‌ ను విస్త‌రించ‌డం. ఈ రెండు కీల‌క అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించి ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వ స్థాయిలో నిర్ణ‌యాలు పూర్త‌య్యాయి. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే...స‌రిగ్గా చెప్పాలంటే ఫిబ్ర‌వ‌రీలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ తెలంగాణ‌కు రానున్నారు. విద్యుత్ కేంద్ర విస్త‌ర‌ణ‌ను ప‌రిశీలించ‌డం, ఫ‌ర్టిలైజ‌ర్ కేంద్రానికి శంకుస్థాప‌న చేసేందుకు మోడీ ఇక్క‌డికి రానున్నారు.

తెలంగాణ విభ‌జ‌న త‌ర్వాత మోడీ చేయ‌బోయే మొద‌టి ప‌ర్య‌ట‌న‌లో కేవ‌లం కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వ‌డం మాత్ర‌మే ఉంటుందా లేక‌పోతే తెలంగాణ ప్ర‌భుత్వం డిమాండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌త్యేక ప్యాకేజీ, ప్ర‌ముఖ ప‌రిశ్ర‌మ‌లు-విద్యా సంస్థ‌ల ఏర్పాటు కూడా ఉంటుందా అనేది ప‌ర్య‌ట‌న స‌మ‌యంలోనే తేలుతుంది మ‌రి.