Begin typing your search above and press return to search.

మోడీ శరణం గచ్ఛామీ అంటున్న ట్రంప్

By:  Tupaki Desk   |   24 Jun 2017 7:49 AM GMT
మోడీ శరణం గచ్ఛామీ అంటున్న ట్రంప్
X
డొనాల్డ్ ట్రంప్ పరమ చెత్త అధ్యక్షుడైతే కావొచ్చు కానీ, మన దేశ ప్రధాని మోడీకి మాత్రం ఆయన తెగ ప్రయారిటీ ఇస్తున్నారు. ఆయన అధ్యక్షుడైన తరువాత ఇంకే ఇతర దేశాధినేతకూ ఇంతవరకు దక్కని అరుదైన గౌరవాన్ని అందిస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత ఇంతవరకు ఏ ఇతర దేశాధినేత కూడా ఆయనతో కలసి వైట్ హౌస్ లో విందు ఆరగించలేదు. ఇప్పుడు ఈ ఘనత మోదీ సొంతం కానుంది. ట్రంప్ తో కలసి వైట్ హౌస్ లో విందు ఆరగించిన తొలి దేశాధినేతగా మోడీ నిలవనున్నారు. అంతేకాదు మోడీ - ట్రంప్ లో ఏకంగా ఐదు గంటల సేపు భేటీ కానున్నారు. ఒక అధినేతతో ట్రంప్ ఇంత సేపు భేటీ కావడం కూడా ఇదే ప్రథమం.

అంతేకాదు... మోడీకి అత్యంత ప్రయారిటీ ఇవ్వాలని ఇప్పటికే ట్రంప్ స్వయంగా వైట్ హౌస్ లోని అన్ని శ్రేణుల స సిబ్బందికి ఆదేశాలిచ్చారట. రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేయాలనే ఆదేశాలు ఉన్నాయట.

కాగా ట్రంప్ తన విధానాలతో అంతర్జాతీయంగా చెడ్డపేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో మోడీ దాదాపుగా అన్ని దేశాల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మోడీ మద్దతు పొందితే కొంతలో కొంత తనపై ఉన్న ముద్రను చెరిపేసే వీలుంటుందని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పారిస్ ఒప్పందం నుంచి వైదొలగడం.. అమెరికాలోకి ఇతర దేశాల వలసలపై కంట్రోల్.. ఉత్తర కొరియాతో వివాదాలు, రష్యాతో సంబంధాలు వంటి అన్ని అంశాలు బెడిసికొట్టిన నేపథ్యంలో ట్రంప్ మోడీతో వీటిలో కొన్ని అంశాలు మాట్లాడొచ్చని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/