Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఖ్యాతి..మోడీ దేశవ్యాప్తం చేస్తున్నాడే..

By:  Tupaki Desk   |   29 Dec 2018 4:31 AM GMT
కేసీఆర్ ఖ్యాతి..మోడీ దేశవ్యాప్తం చేస్తున్నాడే..
X
ఒక్క పథకం.. ఒకే ఒక్క పథకం కేసీఆర్ కు తెలంగాణ ఎన్నికల్లో ఓట్లు కురిపించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కేసీఆర్ పేరును మారు మోగించేలా చేస్తోంది. ప్రధాని మోడీ స్వయంగా కేసీఆర్ కు ఆ క్రెడిట్ ను కట్టబెడుతున్నారు..

తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి కట్టి హేమాహేమాలంతా ప్రచారం చేశారు. దేశంలోని 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, కాంగ్రెస్ పెద్దలు వచ్చి లాబీయింగ్ చేశారు.. కానీ ప్చ్.. ఫలితం రాలేదు.. ఒకే ఒక్కడు బక్కపలుచని కేసీఆర్ ను ఎవరూ ఏమీ చేయలేదు.. ఎందుకు కేసీఆర్ అంత ఏకగ్రీవంగా గెలిచారంటే.. పథకాలే కారణం.. అందుకు ఓట్లు కురిపించింది రైతుబంధేనట.. తెలంగాణ రైతులకు పంటసాయంగా సీజన్ కు రూ.4వేలు చెల్లిస్తున్న ఈ పథకమే కేసీఆర్ కు బంగారమైంది.

అందుకే ఇప్పుడు కేసీఆర్ పథకాలపై దేశంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న బీజేపీ దృష్టి పడింది. కేసీఆర్ కు ఆపద్భంధువైన రైతుబంధును బీజేపీ అక్కున చేర్చుకునేందుకు సిద్ధమైంది. రైతుబంధు గురించి ఇటీవల ప్రధానితో కేసీఆర్ భేటి సందర్భంగా మోడీ ఆరాతీశారట.. ఆ పథకం ఉద్దేశాలు.. లాభం గురించి కేసీఆర్ ను అడిగితెలుసుకున్నాడట.. ఈ పథకం అమలు చేస్తే ఈ సారి అధికారం మీదేనని కేసీఆర్ మోడీకి భరోసానిచ్చినట్టు తెలిసింది.

అందుకే ఉన్న పళంగా ఇప్పుడు మోడీ.. కేసీఆర్ రైతుబంధును దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు.

ఈ దెబ్బతో కేసీఆర్ క్రెడిట్ దేశవ్యాప్తం కానుంది. రైతుబంధు తెలంగాణలో కేసీఆర్ పెట్టిన స్కీమ్. ఇది కేంద్రం అమలు చేస్తే జాతీయ మీడియా అంతా కేసీఆర్ ను వేయినోళ్ల పొగడడం ఖాయం. కేసీఆర్ తెలివితేటలు సూపర్ అంటూ విశ్లేషణలు సాగుతాయి. అందుకే ఒకదెబ్బకు ఇప్పుడు కేసీఆర్ కు రెండు లాభాలు.. అటు దేశవ్యాప్తంగా పేరుతో పాటు... ఇటు రైతుబంధుకు కేంద్రం నిధులు ఇస్తుండడంతో రాష్ట్రంపై భారం కూడా తగ్గిపోనుంది. కేసీఆర్ ప్లానా మజాకా..