Begin typing your search above and press return to search.
మోడీ ట్వీట్ల వాన..తడిసి ముద్దైన ప్రముఖులు
By: Tupaki Desk | 13 March 2019 9:23 AM GMTసరిగ్గా నాలుగు గంటల క్రితం మొదలైన మోడీ ట్వీట్ల వాన ఇంకా కురుస్తూనే ఉంది. దేశంలోని సినీ - రాజకీయ - క్రీడా - పారిశ్రామిక వర్గాలందరినీ ఎవ్వరినీ వదలకుండా మోడీ విన్నపాలు వినిపిస్తూనే ఉన్నాడు. దయచేసి దేశంలోని 130 కోట్ల మందిని ఓటేసేలా చూడండని అని విజ్ఞప్తి చేశారు.
కాదెవరు ఓటు వేయించడానికి అనర్హం అన్నట్టు సరిగ్గా నాలుగు గంటల క్రితం బీజేపీ పెద్దాయన - ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ఓపెన్ చేసి పోస్టులు పెట్టడం షురూ చేశాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా తమిళనాడు కన్యాకుమారి నుంచి మొదలు పెడితే కాశ్మీర్ దాకా.. ఇటు గుజరాత్ నుంచి అటు తూర్పున అస్సాం దాకా కనిపించిన సినీ - రాజకీయ - క్రీడా - పారిశ్రామికవేత్తలందరికీ ట్యాగ్ చేస్తూ.. ‘మీరు దేశానికి ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఇప్పుడు ఎన్నికల టైం.. అందరినీ ఓటు వేయించేలా చేయండి.. అది మన అందరి బాధ్యత అనేలా’.. ఒక్కొక్క వర్గానికి ఒక్కో ట్వీట్ చేస్తూ వారందరికీ విజ్ఞప్తి చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఉదయం నుంచి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రముఖులంతా ప్రజలను ప్రభావితం చేయాలని కోరారు. రాహుల్ గాంధీతోపాటు ట్విట్టర్లో యాక్టివ్ గా ఉండే అన్ని రాజకీయ పార్టీల నేతలు - దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు.. క్రీడాకారులు - జర్నలిస్టులు - సినీ స్టార్లు - మీడియా అధినేతలను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
సౌత్ ఇండియా నుంచి ఇద్దరు స్టార్ హీరోలను ఉద్దేశించి మోడీ ట్వీట్ చేశారు. అందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఉండగా.. తెలుగులో నాగార్జున ఉన్నారు. మీరు కోట్లాది మంది ప్రజలను ఎంటర్ టైన్ చేస్తారని.. ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యం చేయాలని కోరారు.
ఇక బాలీవుడ్ అగ్రహీరోలు - హీరోయిన్లు - దర్శకులను మోడీ అభ్యర్తించాడు. అమీర్ ఖాన్ - అమితాబ్ - షారుఖ్ - సల్మాన్ సహా వరుణ్ ధావన్ - రణవీర్ - రణబీర్ - విక్కీ కౌశల్ - దీపిక - అలీయాభట్ - అనుష్క శర్మ లను ఉద్దేశించి ఓటుపై అవగాహన కల్పించాలని కోరారు.
ఇక పారిశ్రామికవేత్లలైన ఆనంద్ మహేంద్ర - రతన్ టాటా - అశిష్ చౌహాన్ లను ఓటు వేయించేలా చేయాలని కోరారు. క్రీడాకారుల కోటాలో శ్రీకాంత్ కిదాంబి - పీవీ సింధూ - సైనా - సచిన్ - విరాట్ - ధోనిలకు విన్నవించారు. ఇలా అన్ని వర్గాల వ్యక్తులను మోడీ వేడుకున్నారు.
మోడీ ప్రముఖుల ద్వారా ఓటేయమని కోరడం బాగానే ఉంది కానీ.. అస్సలు ఎవ్వరికీ ఓటేయాలి.. యువత ఎక్కువగా ఓటేస్తే ఎవ్వరికీ లాభం అన్న కోణంలో విశ్లేషిస్తున్నారు. మోడీ కోరిక వెనుక బీజేపీకి ఓటేయాలన్న ప్రచారం దాగి ఉందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదీ ఏమైనా ఓటేయాలన్న మోడీ కోరిక సరైనదే అయినా.. దాని వెనుక దురద్దేశం లేకుంటే ఇంకా మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.