Begin typing your search above and press return to search.

ముందు త‌రాల‌కు మోడీ నేర్పిస్తున్న పాఠ‌మేంటి?

By:  Tupaki Desk   |   29 Dec 2020 1:30 AM GMT
ముందు త‌రాల‌కు మోడీ నేర్పిస్తున్న పాఠ‌మేంటి?
X
కేంద్రంలోని న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం ఇటీవ‌ల కాలంలో ఏ వేదిక ఎక్కినా.. దివంగ‌త వాజ్‌పేయి నామ‌స్మ‌ర‌ణ‌తో మునిగి తేలుతోం ది. విష‌యం ఏదైనా కూడా.. వాజ్ పేయిని రంగంలోకి దింపుతోంది. ఇటీవ‌ల రైతు సాగు చ‌ట్టాల‌పై తీవ్ర‌స్థాయిలో దుమారం రేగిన నేప‌థ్యంలోను, జ‌మ్ము క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసిన సంద‌ర్భంలోనూ.. మోదీ.. ప్ర‌ధానంగా వాజ్‌ పేయి కార్డును బాగానే వాడుకున్నారు. గ‌డిచిన కొన్నాళ్లుగా.. దేశంలో ప్ర‌ధానిపాల‌న‌పై న‌ర్మ‌గ‌ర్భ వ్య‌తిరేకత సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆ వ్య‌తిరేక‌త నుంచి త‌ప్పించుకునేందుకు మోడీ వ్యూహాత్మ‌కంగా వాజ్‌పేయి జ‌పాన్ని చేస్తున్నార‌ని అంటున్నారు.

అయితే.. ఇది ఏమేర‌కు ఫ‌లిస్తుంది? తామంతా వాజ్‌ పేయి వార‌సుల‌మ‌ని చెబుతున్న ప్ర‌ధాని.. నిజంగానే వాజ్‌ పేయి ధోర‌ణిలో కొంత‌మేర‌కైనా అవ‌లంబిస్తున్నారా? అంద‌రినీ స‌మాన దృష్టితో చూడ‌గ‌లుగుతున్నారా? అంటే.. మాత్రం ప్ర‌శ్న‌లే త‌ప్ప స‌మాధానం క‌నిపించ‌డం లేదు. ఏ ఎండ‌కు ఆగొడుగు ప‌ట్ట‌డంలో సిద్ధ‌హ‌స్తుడైన నాయ‌కుడిగా మోడీకి, ఆయ‌న ప‌రివారంలో కీల‌క‌మైన అమిత్‌ షాకు పేరుంది. ఇప్పుడు వారు ఎంచుకున్న మార్గం వాస్త‌వానికి కార్పొరేటీక‌ర‌ణ‌. అయితే.. గ‌తంలో వాజ్‌పేయి కూడా అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చారు. కానీ, ఏనాడూ.. ఇంత వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకోలేదు. పైగా రైతుల‌కు సంబంధించిన విష‌యాల్లో అనేక విధాలుగా ఆచితూచి వ్య‌వ‌హ‌రించారు.

కానీ, ఇప్పుడు వాజ్‌ పేయి స్మ‌ర‌ణ‌లో మునిగి తేలుతున్న మోడీ.. కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై ఎవ‌రిని సంప్ర‌దించారు? రైతుల‌తో చ‌ర్చించారా? లేక‌.. రైతు వ్యాపారుల‌తో సంప్ర‌దించారా? పార్ల‌మెంటులో అయినా.. స్థిమితంగా ఆయా చ‌ట్టాల‌పై చ‌ర్చించారా? రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిపక్షం బ‌లంగా ఉన్న నేప‌థ్యంలో అక్క‌డైనా చ‌ర్చ‌కు అవ‌కాశం క‌ల్పించారా? అంటే.. ఏమీ లేదు. ముఖ‌స్థుతికి.. ప‌ర‌నింద‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డంలోనే మోడీ స‌ర్కారు ముప్పూట‌లా బిజీగా ఉన్నద‌న్న‌.. సీనియ‌ర్ పాత్రికేయుల మాట అక్ష‌రాలా వాస్త‌వం. ఎక్క‌డిక‌క్క‌డ అధికార దాహం.. నాడు వాజ్‌పేయి చూపించ‌లేదు.

అదే చూపించి ఉంటే.. ఒక్క ఓటు తేడాతో ఆయ‌న స‌ర్కారు కూలిపోయి ఉండేది కాదేమో!! కానీ, నేడు ఎక్క‌డిక‌క్క‌డ అధికార లాల‌స‌తో.. ప్ర‌భుత్వాల‌ను ప‌డ‌గొడుతూ.. తాము గ‌ద్దెనెక్కుతున్న వైనం.. బీజేపీని అక్ష‌రాలా ఆత్మ‌హ‌త్యా స‌దృశం వైపు నెడుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అయినా.. తాము వాజ్‌ పేయి వార‌సుల‌మే అంటారు. పోనీ.. అలా అన్నా.. అప్ప‌ట్లో వాజ్‌పేయి.. అన్నీ తామై.. వ్య‌వ‌హ‌రించిన అడ్వాణీ - ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి వంటి వారిని ప‌క్క‌న పెట్టేసి.. అక్ష‌రాలా చేస్తోంది.. వాజ్‌ పేయి పేరుతో రాజ‌కీయ విన్యాస‌మే.. త‌ప్ప‌. సిద్ధాంతం ఏమాత్రం కాదు!!