Begin typing your search above and press return to search.

నాడు ఒక్కడిగా వచ్చి నేడు దేశాన్ని శాసిస్తున్నాడు

By:  Tupaki Desk   |   25 Oct 2015 3:16 AM GMT
నాడు ఒక్కడిగా వచ్చి నేడు దేశాన్ని శాసిస్తున్నాడు
X
దాదాపుగా 24 ఏళ్ల క్రితం బెజవాడ రైల్వేస్టేషన్ కు ఓ వ్యక్తి వచ్చాడు. నిజమే.. నిత్యం లక్షల మంది బెజవాడ మీదుగా రైల్లో రాకపోకలు జరుపుతుంటారు. వారిలో.. ఒకడి గురించి గర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. అందులోకి ఒక్కడిగా.. గుజరాత్ నుంచి వచ్చిన ఆయన వెళ్లాల్సింది ఒడిశాలోని కోణార్క్ పట్టణానికి. మార్గమధ్యంలో బెజవాడలో ఒక హాల్ట్ ఇచ్చారు.

ఆయనకు బస.. బోజనం లాంటివి చూడాలంటూ బెజవాడ సిటీ వన్ టైన్ బీజేపీ నేత పిళ్లా హరికృష్ణకు గుజరాత్ నుంచి ఒక స్నేహితుడు ఫోన్ చేసి కోరారు. ఇంతకీ వస్తున్న వ్యక్తి ఎవరంటే.. బీజేపీ జాతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కాకపోతే.. అందరికి పెద్దగా తెలిసిన వ్యక్తి కాదు. స్నేహితుడి మాట మేరకు బెజవాడ రైల్వే స్టేషన్ కు వెళ్లి మరీ.. సదరు వ్యక్తికి సాదర స్వాగతం పలికాడు.

గుజరాత్ నుంచి బెజవాడ సిటీకి రైల్లో దిగిన ఆ వ్యక్తి ఎవరో కాదు.. నేటి ప్రధాని నరేంద్ర మోడీ. 24 ఏళ్ల క్రితం సామాన్యుడిగా ఉన్న ఆయన ఒక్కడిగా బెజవాడ స్టేషన్ కు వచ్చి.. స్నేహితుడి సాయంతో బస.. భోజనంతో పాటు.. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మ ఆశీస్సులు పొందారు.

ఇప్పుడు అదే వ్యక్తి ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ఆయన కోసం లక్షలాది మంది ఎదరుచూశారు. ఇక.. వీవీఐపీలు అన్న వారు సైతం ఆయన రాక కోసం వెయిట్ చేశారు. నాడు అతి సాదాసీదాగా వచ్చిన మోడీకి అతిధ్యం ఇచ్చిన రామకృష్ణ.. నేడు అసమాన్యుడిగా వచ్చిన ప్రధానితో మోడీతో తనకున్న అనుబంధానికి మురిసిపోయిన పరిస్థితి. ఆయనతో రామకృష్ణకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నోళ్లు బెజవాడలో కొందరు లేకపోలేదు. తాను సామాన్యుడిగా ఉన్నప్పుడు సాయం చేసి.. ఆదరించిన హరికృష్ణను మోడీ గుర్తు చేసుకుంటే బాగుండేదేమో.