Begin typing your search above and press return to search.
మోడీ-మమత ‘దేవుళ్ల’ రాజకీయం
By: Tupaki Desk | 9 May 2019 11:56 AM GMTరాజకీయ నాయకులకు దేశంలో అసలు సమస్యలే లేకుండా పోయాయి. పేదలు, మధ్యతరగతి వారు.. నిరుద్యోగులు, రైతులు ఇలా ఎన్నో సబ్బండ వర్గాల సమస్యలు కోకోల్లలు ఉన్నాయి. దేశంలో విద్యా, వైద్యం పరిస్థితి అయితే ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. కానీ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ సమస్యలు ప్రచారాస్త్రాలు కానే కావు.. ‘పాకిస్తాన్ పై వైమానిక దాడులు’.. అయోధ్యలో రామమందిరం.. చౌకీదార్.. ఇవే వాళ్ల ప్రచార అస్త్రాలయ్యాయి..
ప్రజల వద్దకు ఎవరైనా ఓట్ల కోసం వెళితే.. తాము ఈ ఐదేళ్లలో ఇది చేశాం.. వచ్చే ఐదేళ్లలో పేదలకు మేలు చేసేలా ఇలా చేస్తామని చెబుతుంటారు. కానీ ఇదెక్కడి చోద్యమో కానీ దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు అడుక్కునే విష ప్రచార సంస్కృతి ప్రస్తుతం దాపురించింది.
పశ్చిమ బెంగాల్ లో ఇప్పుడు బీజేపీ ‘శ్రీరాముడే’ ప్రధాన అస్త్రంగా మారారు. ప్రధాని మోడీ ఏకంగా ‘జైశ్రీరామ్ ’ అంటూ నినదిస్తానని.. దమ్ముంటే తనను బెంగాల్ సీఎం మమతా అరెస్ట్ చేసుకోవచ్చని ప్రజల్లో భక్తి రాజకీయాలను తట్టిలేపారు..
మరి ఫైర్ బ్రాండ్ మమత ఊరుకుంటుందా.. దానికి విరుగుడుగా బెంగాలీల ఆరాధ్య ధైవం దుర్గామాతాను నెత్తిన పెట్టుకున్నారు. దుర్గామాతాకు పది చేతులుంటాయి.. వాటితో మీ అధికారాలు పోతాయంటూ హెచ్చరించారు.
బెంగాల్ లో జై శ్రీరామ్ అన్న బీజేపీ కార్యకర్తలను మమత అరెస్ట్ చేయడంతో ‘శ్రీరాముడు-దుర్గామాతా’ వివాదం మోడీ-మమతల మధ్యకు వచ్చింది. ఇలా ఓట్ల కోసం దేవుళ్ల మధ్య కూడా చిచ్చు పెడుతున్న నేతలను ఇప్పుడే చూస్తున్నాం.