Begin typing your search above and press return to search.

మాస్క్ మ్యాన్ గా మారిన మోడీ.. కారణమేంటి?

By:  Tupaki Desk   |   11 April 2020 8:50 AM GMT
మాస్క్ మ్యాన్ గా మారిన మోడీ.. కారణమేంటి?
X
కరోనా వచ్చి పక్షం రోజులు దాటింది. లాక్ డౌన్ మార్చి 24న విధించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రధాని మోడీ జాతినుద్దేశించి మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలు - సీఎంలు సహా ఎవరితో మాట్లాడినా ముసుగు లేకుండా స్వేచ్ఛగా మాట్లాడారు. కానీ సడన్ గా ముసుగు వీరుడిగా మారిపోయారు. మరి ఇది కరోనా వల్ల వచ్చిన భయంతో కూడిన బెరుకా? లేక నిజంగానే పిలుపునివ్వడమే కాదు.. పాటించాలన్న ఉద్దేశమా.? ఏదైతేనే సభ్య సమాజానికి మంచి మెసేజ్ ఇద్దామన్న ఆలోచనతో మోడీ ధరించిన ఈ ముసుగుపై ఇప్పుడు చర్చ మొదలైంది.

దేశంలో కరోనా వైరస్ తీవ్రత గురించి తగిన సూచనలు ఇస్తూ - ప్రధాని నరేంద్ర మోడీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే ఎప్పుడూ లేని విధంగా ప్రధాని నోటికి మాస్క్ తో కనిపించడం అందరి దృష్టిలో పడింది. ఫేస్ మాస్క్‌ తో ప్రధాని కనిపించడం ఇదే మొదటిసారి. బహుశా - ఫేస్ మాస్క్‌ తో సమావేశాలకు హాజరైన ఏకైక ప్రధానమంత్రి ఈయనే కాబోలు.. అంతకుముందు - చైనా అధ్యక్షుడు జి జిన్‌ పింగ్ తన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగంలోనూ ఒక ముసుగు ధరించాడు.

మోడీ ముసుగు ధరించడాన్ని బట్టి దేశంలో కరోనా తీవ్రత పెరిగిందనే అర్థం ఘోచరిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున పెరుగుతుండడంతో ఆ తీవ్రతను కూడా మోడీ మాస్క్ చూపిస్తోంది. మార్చి 25 న - భారత్ లో కేవలం 657 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. కానీ, ఇప్పుడు - కేసుల సంఖ్య 7600 కు పెరిగింది. లాక్ డౌన్ పొడిగింపు కోసం ఇప్పటికే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా మోడీ పొడిగింపు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

కానీ, ప్రస్తుత కరోనా సంక్షోభం నుండి బయటపడటానికి ఇబ్బందులకు గురైన రాష్ట్ర ప్రభుత్వాలకు మోడీ కొంత ఆర్థిక ఓదార్పునివ్వవలసి ఉంటుందని అందరూ సీఎంలు కోరినట్టు తెలిసింది. లేకపోతే ఆర్థికంగా ఆ రాష్ట్రాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఇప్పటికే నిధులు లేక విలవిలలాడుతున్నామన్నారు. బాండ్లు - ఇతర వాటిని వేలం వేస్తూ సొమ్ము చేసుకుంటున్నామని మోడీకి సమస్యలు ఏకరువు పెట్టినట్టు తెలిసింది.

ఈ కరోనా సమీక్షలో లాక్ డౌన్ పై మోడీ దేశంలోని అందరూ రాష్ట్రాల ముఖ్య మంత్రుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. లాక్ డౌన్ పొడిగింపు పై ఏకాభిప్రాయానికి రావడానికి మోడీ చాలా తీవ్రంగా యోచిస్తున్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ అమలు విషయంలో ఎటువంటి లీకేజీలను ప్రస్తుతానికి మోడీ మీటింగ్ లో ఇవ్వలేదని తెలుస్తోంది.