Begin typing your search above and press return to search.
బ్రిటన్ ప్రధాని దగ్గర మోడీ పేల్చిన జోక్
By: Tupaki Desk | 8 Nov 2016 3:04 AM GMTస్నేహితుల వద్ద.. పరిచయస్తుల వద్ద జోక్ పేలిస్తే పెద్ద ప్రమాదమేమీ ఉండదు. కానీ.. అగ్రరాజ్య ప్రధాని దగ్గర జోక్ వేయటం అంత చిన్న విషయమేమీ కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా తీవ్ర విమర్శలు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. విమర్శల తర్వాత సంగతి.. చొరవ తీసుకొని సమయానికి తగ్గట్లుగా జోకులేయటం అంత తేలికైన వ్యవహారం కాదు. కానీ.. చతురతతో మాట్లాడే నైపుణ్యం ఉన్న ప్రధాని మోడీ.. తాజాగా దేశ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో మాట్లాడే సందర్భంగా ఆయన వేసినట్లుగా చెబుతున్న జోక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
రాజకీయాలతో పాటు.. అన్ని విషయాల్లోనూ ప్రధాని మోడీ ఎంత అప్ డేటెడ్ గా ఉంటారన్న విషయం తాజా జోక్ లో కనిపిస్తుంది. తీరిక లేని షెడ్యూల్ లో కూడా క్రీడలకు సంబంధించిన సమాచారంపైనా ఆయన దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తుందని చెప్పకతప్పదు. తన భారత పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని థెరిసా మే ప్రధాని మోడీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనో విందును ఏర్పాటు చేశారు.
విందు తర్వాత వంటలు ఎలా ఉన్నాయని ప్రశ్నించిన మోడీ.. బహుశా భోజనం మీకు సంతోషాన్ని కలిగించి ఉంటుందని భావిస్తున్నట్లుగా వ్యాఖ్యానించారట. దీనికి స్పందించిన థెరిసా.. భోజనం చాలా బాగుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనికి స్పందించిన ప్రధాని మోడీ.. ‘‘మంచి రుచికరమైన భోజనం చేసే కుక్ మా దగ్గర ఉన్నాడు. కానీ.. అసలైన కుక్ ఇంగ్లండ్ క్రికెట్ జట్టుతో పాటే భారత పర్యటనకు వచ్చాడుగా’’ అని చమత్కించారట. మోడీ మాటలకు బ్రిటన్ ప్రధాని నవ్వేయటంతో అక్కడి వాతావరణం మరింత ఉల్లాసవంతంగా మారిందట. మోడీ రాజకీయ నేర్పు మాత్రమే కాదు.. ఆయనలోని హాస్య చతురత ఎంతన్నది థెరిసా మేకు అర్థమయ్యే ఉండి ఉంటుంది.