Begin typing your search above and press return to search.
పోలీస్ బాస్ ల్ని మోడీ అడిగిన ప్రశ్నఇదేనా?
By: Tupaki Desk | 26 Nov 2016 5:33 AM GMTప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ రెండోసారి తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. ఈసారి ఆయన తెలంగాణ పర్యటనకు కారణం హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో జరుగుతున్న డీజీపీ సదస్సుకు ఆయన హాజరయ్యారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న ఆయన.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో విమానాశ్రయంలోనే ప్రత్యేకంగా పది నిమిషాలు భేటీ అయ్యారు.
అనంతరం పోలీస్ అకాడమీకి వెళ్లిన మోడీ.. అక్కడ డీజీపీల సదస్సుకు హాజరయ్యారు. పలువురు డీజీపీలతో మాట్లాడిన ప్రధాని.. ఒక కీలకాంశంపై ఆయన దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? బ్యాంకులు.. ఏటీఎం కష్టాలపై గ్రౌండ్ రిపోర్ట్ ఏమిటన్న అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.
పోలీస్ అకాడమీలో జరిగిన విందుకు హాజరైన ప్రధాని.. ఈ సందర్భంగా విందు చేస్తూనే పలువురు డీజీపీలతో మాటామంతి జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా నోట్ల రద్దు నిర్ణయం ఆయా రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పరిస్థితులు.. ప్రజల స్పందనల్ని తెలుసుకున్నారు. మోడీ ఆరా తీసిన డీజీపీల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు.. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల డీజీపీల నుంచి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయటం కనిపించింది. నోట్ల రద్దు పరిణామాలపై పలువురు డీజీపీలతో మోడీ మాట్లాడటం గమనార్హం.