Begin typing your search above and press return to search.

రైతులకు ఏదీ ఉద్దీపనం మోడీజీ..?

By:  Tupaki Desk   |   19 Nov 2019 10:39 AM GMT
రైతులకు ఏదీ ఉద్దీపనం మోడీజీ..?
X
ఆర్థిక మాంద్యం దేశాన్ని పట్టిపీడిస్తోంది. ప్రజలు - రైతుల వద్ద చిల్లీ గవ్వ లేకుండా పోతోంది. వేళ ఉద్యోగాలు పోయి రోడ్డున పడుతున్నారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం హాహాకారాలు చేస్తున్నారు. ప్రజలు ఇంత కటకట ఎదుర్కొంటున్న వేళ ఇప్పుడు ఎవరు వాహనాలు కొనుగోలు చేయకపోవడంతో ఆటోమోబైల్ రంగ పరిశ్రమ పడిపోయింది. దేశంలోని పరిశ్రమలు కుదేలయ్యాయి. అయితే ఆటోమోబైల్ - పరిశ్రమలు - టెలికాం తదితర పరిశ్రమలకు ఉద్దీపనలు ప్రకటిస్తూ వేల కోట్లను కేంద్రంలోని మోడీ సర్కారు ఇస్తోంది. దేశ ఆర్థిక రంగాన్ని కుదుట పరచడానికంటూ కార్పొరేట్లకు దోచిపెడుతోందన్న వైనం విమర్శలకు తావిస్తోంది..

ప్రభుత్వరంగ సంస్థల నుంచి వేగంగా పెట్టుబడులు ఉపసంహరిస్తూ ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్న మోడీ సర్కారు.. ఇదే సమయంలో మాంద్యంతో కుదేలైన.., దేశానికి తిండి పెడుతున్న రైతులను ఆదుకోకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించక పోవడంతో ఎంతో మంది రైతులు ఆకలిచావులు చస్తున్నారు. ఓవైపు ఉల్లిధర ఆకాశాన్నంటి అంటుతున్నా.. ఉల్లికి మద్దతు ధరలేక మహారాష్ట్ర రైతులు రోడ్డెక్కుతున్నారు. దేశంలోని ప్రజలు - పేదలు - రైతుల ఆకలి తీర్చని సర్కారు బెయిల్ అవుట్ ప్యాకేజీలంటూ వేలకోట్లను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్న తీరు మాత్రం ప్రజల్లో విమర్శలకు తావిస్తోంది.

సదురు కార్పొరేట్లు మునిగినా నష్టపోయినా ఆ కంపెనీ వ్యవస్థాపకులకు మాత్రమే నష్టం. కానీ ప్రజలు - రైతులు నష్టపోతే దేశానికే నష్టం. కానీ మోడీ సర్కారు మాత్రం కార్పొరేట్ కంపెనీలకు మాంద్యం అంటూ వేల కోట్లను ఉద్దీపనలు ప్రకటిస్తోంది. దేశంలోని 40-50వేల కోట్ల రైతులకు మాత్రం ఒక్కటంటే ఒక్క ఉద్దీపన పథకాన్ని మోడీ సర్కారు ప్రకటించలేదు..

ఇక మాంద్యంతో కుదేలైన కుటీర - చిన్నతరహా - చేనేత - పరిశ్రమలకు మోడీ సర్కారు చేసింది ఏమీలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక మాంద్యం కారణంగా కార్మికులకు జీతాలు పెరగక.. వేళకు రాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వ్యవసాయం దెబ్బతింది. నిరుద్యోగం ప్రబలుతోంది. రైతులు - కార్మికులు - ఇతర వర్గాలు ఉద్యోగ ఉపాధి లేక సతమవుతుంటే మోడీ సర్కారు పట్టించుకున్న పాపాన పోవడంలేదు. మాంద్యం ఒక్క పారిశ్రామిక వర్గానికే ఉన్నట్టు వారికే ఉద్దీపనలు కొనసాగిస్తోంది.

దివాళా తీసిన కంపెనీలను ఆదుకోని వారికి వేల కోట్ల బెయిల్ అవుట్ ప్యాకేజీలు ఇచ్చి వారిని ఆదుకుంటోంది బీజేపీ సర్కారు. అయితే అలా చేయడం వల్ల కార్పొరేట్లకు లాభం తప్పితే సామాన్య ప్రజలకు రూపాయి లాభం లేదు. దేశంలో 40-50 కోట్ల మంది దాకా రైతులున్నారు. వాళ్ల అప్పులు తీర్చి వారిని ఆదుకునే ప్రయత్నాలను మాత్రం మోడీ చేయడం లేదన్న విమర్శలున్నాయి. ఇన్నివేల కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకోకుండా గుప్పెడు కార్పొరేట్ల సేవలో తరిస్తున్న మోడీ సర్కారు తీరుపై అందరిలోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.