Begin typing your search above and press return to search.
వలస కార్మికులపై నోరుజారిన కేంద్రమంత్రి
By: Tupaki Desk | 1 Jun 2020 11:50 AM GMTలాక్ డౌన్ వలస కూలీల కష్టం అంతా ఇంతా కాదు.. వారు ఆకలితో అలమటించలేక.. పక్కరాష్ట్రాల్లో ఉండలేక నడిచిపోతూ.. సైకిళ్లపై మీద వెళ్తూ రైలు పట్టాలపై నడుస్తూ ఇలా హృదయవిదారకమైన దృశ్యాలు కనిపించాయి. వాహనాల్లో వెళుతూ చనిపోయిన వారు కూడా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా వలస కూలీల వెతలపై దేశవ్యాప్తంగా సానుభూతి ఉంటే కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ మాత్రం వారిపై నోరుజారడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఆయనపై విమర్శలకు దారితీస్తోంది.
వలస కూలీల సంక్షోభంపై మంత్రి తోమర్ మాట్లాడుతూ వలస కూలీలకు సహనం లేదని.. ఆ కూలీలు వేచి ఉండాల్సిందని నోరుజారారు. జనాలు వలస పోతుంటారని తెలుసని.. లాక్ డౌన్ పరిస్థితుల్లో జనం అభద్రతలో ఉన్నట్లు భావించడం సహజమని.. జనం ఇంటికి వెళ్లాలనుకోవడం సహజం అని చెప్పారు.
వలస కార్మికులు నడుస్తూ.. రైలు పట్టాల మీద చనిపోవడం దురదృష్టకరమని.. ఇళ్లకు చేరాలనుకునే తొందరలోనే ఈ ప్రమాదం జరిగిందని కేంద్ర మంత్రి తోమర్ అభిప్రాయపడ్డారు. రైలు వచ్చేవరకు జనం వేచి ఉండాల్సిన అవసరం ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కానీ వలస కార్మికులు కొంత అసహనంగా ఉన్నారని.. అందుకే నడిచి, సైకిళ్ల మీద వెళుతూ కష్టాలు పడ్డారని కేంద్రమంత్రి తోమర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.