Begin typing your search above and press return to search.
ఏం కావాలో బాబును అడగమని మోడీ చెప్పారా?
By: Tupaki Desk | 22 Aug 2015 5:10 AM GMTపద్నాలుగు నెలలుగా ఏపీ గురించి పట్టించుకోని ప్రధాని నరేంద్రమోడీ ఉన్నట్లుండి ఏపీ గురించి ఆలోచిస్తున్నారా? ఏదో ఒకటి చేయాలని భావిస్తున్నారా? ఏపీకి అవసరమైన ప్యాకేజీ గురించి.. అంశాల వారీగా ఏపీ సర్కారును అడిగి తెలుసుకొని.. అందుకు తగినట్లుగా ప్యాకేజీ కసరత్తు చేయాలని సూచించారా? లాంటి ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
అయితే.. ఇలాంటి వాదనల్లో నిజం ఎంతన్నదన్న మాట మీద పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఏపీ గురించి మోడీ ఇంతగా ఆలోచిస్తున్నారా అంటే సందేహమే అని చెప్పాలి. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు ఉన్నట్లుండి మోడీకి ఏదో గుర్తుకు వచ్చేసినట్లు ఆయనేదో చేసేయాలన్నట్లుగా వస్తున్న వార్తలు మొత్తం కూడా హైప్ క్రియేట్ చేయటమే తప్పించి మరొకటి కాదన్న మాట వినిపిస్తోంది.
అయితే.. బయటకు వచ్చిన వాదన.. అసలు విషయం వేరే అని చెబుతున్నారు. ఏపీకి ఏం కావాలన్న విషయాన్ని తెలుసుకొని అందుకు తగ్గట్లు ప్యాకేజీ కసరత్తు చేయాలన్నట్లుగా వార్తలు వస్తున్నా.. అసలు వాస్తవం వేరే అని చెబుతున్నారు. అసలు ఏపీ సర్కారు ఏం కోరుకుంటుంది? వారికేం కావాలన్న విషయాలు తెలుసుకోవాలంటూ ప్రధాని మంత్రి చెప్పి ఉంటారని.. అందులో భాగంగా కేబినెట్ సెక్రటరీ ఏపీ రెసిడెంట్ కమిషనర్ వివరాలు తెలుసుకొని ఉండొచ్చని చెబుతున్నారు.
ఈ మాత్రం దానికే.. ఏదో జరిగిపోతుందని.. మోడీ సర్కారు వరాల మీద వరాలు ప్రకటించేసి.. ఏపీ ప్రజల్ని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తుందన్న ప్రచారం అంతా ఉత్తదేనని చెబుతున్నారు. నిజంగా అలాంటి పరిస్థితే ఉంటే.. ఏపీకి ఏం కావాలన్న అంశంపై అధికారంలోకి వచ్చిన 14 నెలలకు కానీ నిద్ర లేవరని చెబుతున్నారు.
ఇప్పటికే.. ఏపీకి ఏమేం చేశామో చిట్టా మొత్తం సిద్ధం చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటేనే.. మోడీ సర్కారు ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయనున్నారన్నది తెలుస్తుంది. అలాంటిది.. ఏపీకి ఏం కావాలో తెలుసుకొని అందుకు తగ్గట్లుగా ప్యాకేజీ సిద్ధం చేయాలన్న మాటను ఏపీకి అనుకూలంగా రాసేయటం అంతా ఒక వర్గానికి చెందిన మీడియా మాయగా అభివర్ణిస్తున్నారు. నిజానిజాలు మోడీ భేటీ తర్వాత బయటకు వచ్చేస్తాయి కదా.