Begin typing your search above and press return to search.

కమలదళంలో చేరినా కారుకూతలేనా?

By:  Tupaki Desk   |   12 March 2018 5:16 PM GMT
కమలదళంలో చేరినా కారుకూతలేనా?
X
ఒక్కో పార్టీకి ఒక్కొక్క ప్రత్యేకమైన క్రమశిక్షణ వుంటుంది. ఒక్కొక్క ప్రత్యేకమైన సంస్కారం ఉంటుంది. అలాగే ఒక్కొక్క ప్రత్యేకమైన కు సంస్కారం కూడా ఉంటుంది. ఆ రకంగా చూసినప్పుడు భారతీయ జనతా పార్టీలో తమకంటూ ఒక విలక్షణమైన ప్రత్యేకమైన కుసంస్కారం అలవాట్లు ఉంటాయని నాయకులు నిరూపించుకుంటున్నారు. కుసంస్కారం అనేది - మహిళల పట్ల అనుచితంగా మాట్లాడటం అనేది... సమాజ్ వాదీ పార్టీ లాంటి వారికి మాత్రమే గుత్తసొత్తు కాదని, తమకు కూడా తప్పకుండా దానిపై హక్కు ఉన్నదని భారతీయ జనతా పార్టీ లో చేరిన వారు భావిస్తున్నట్లు ప్రజలు అనుకుంటున్నారు.

తాజాగా సమాజ్ వాదీ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన సీనియర్ నాయకుడు మాట్లాడుతున్న మాటలు చూస్తే అదే అభిప్రాయం కలుగుతోంది. ఆ పార్టీ నాయకులు నరేష్ అగర్వాల్ సోమవారం నాడు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అంతే డేటాలు ఉన్నది అధికార పార్టీ నేతలు ఆయనకు ఒక్కసారిగా పూనకం పొంగుకొచ్చే సింది. 'డాన్సులు చేసే వాళ్లకు టికెట్లు ఇవ్వడం సిగ్గుచేటు. నాకు ఇవ్వకుండా డాన్స్ చేసే వాళ్లకు టిక్కెట్లు ఇచ్చి అవమానించారు' ... అంటూ ఆయన జయాబచ్చన్ మీద తన అక్కసును వెళ్లగక్కారు.

మహిళా బిల్లు అనేది ఇప్పటి దాకా పార్లమెంటు ఆమోదం పొందకుండా పదేపదే అడ్డం పడుతున్న సమాజ్ వాదీ లాంటి పార్టీలో ఉన్నంత కాలం ఇలాంటి కుసంస్కారాన్ని ఎంత మోతాదులో ప్రదర్శించినప్పటికీ తప్పు లేదు కానీ .... భాజపాలో కూడా ఇదే ధోరణి ప్రదర్శిస్తే ఎలా అనే విమర్శలు పరిశీలనలు వినిపిస్తున్నాయి. కేవలం రెండు రోజుల కిందట ఆర్య సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఆజంఖాన్ - తమ పార్టీకే చెందిన సినీ నటి ఎంపీ జయప్రద గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. డాన్సులు చూస్తూ కూర్చుంటే రాజకీయాల సాగేదెలా అంటూ ఆయన జయప్రదను చులకన చేసి మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు ఆ పార్టీ నైజం కూడా అంతే అని అనిపించవచ్చు. కానీ కమలదళంలో చేరిన తర్వాత కూడా మహిళల పట్ల అనుచితమైన వ్యాఖ్యలను కనీస సంస్కారం లేకుండా మాట్లాడటం అనేది చిత్రంగా కనిపిస్తుంది. ఇలాంటి నాయకుల వాచాలత కు భాజపా అగ్రనేతలు ఆదిలోనే అడ్డుకట్ట వేయకపోతే గనుక పార్టీకి వీరు ప్రమాదకరంగా మారుతారనే అభిప్రాయం కూడా ప్రజల్లో వ్యక్తమవుతోంది.