Begin typing your search above and press return to search.
అన్న మరణించిన రెండు రోజులకే తమ్ముడు మృతి ..ప్రధాని మోడీ సంతాపం!
By: Tupaki Desk | 27 Oct 2020 3:38 PM GMTకరోనా మహమ్మారి సోకి ఎంతోమంది సామాన్యులతో పాటుగా ప్రముఖులు , రాజకీయ నేతలు , సినీ సెలెబ్రెటీలు కూడా మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు మృతి చెందగా ..తాజాగా మరో సినీ సూపర్ స్టార్ , మాజీ ఎమ్మెల్యే కరోనా కాటుకి బలైయ్యాడు.
గుజరాతీ సినిమాల సూపర్ స్టార్ ,మాజీ ఎమ్మెల్యే నరేష్ కనోడియా కరోనా కి చికిత్స తీసుకుంటూ , దాన్ని ఎదిరించలేక తుదిశ్వాసవిడిచారు.ఆయన వయసు 77 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా కరోనా ఇన్‌ఫెక్షన్ తర్వాత అహ్మదాబాద్‌లోని యు.ఎన్. మెహతా ఇనిస్టిట్యూట్ లో చికిత్స పొందుతున్నాడు. నరేష్ కనోడియా 300 కి పైగా గుజరాతీ సినిమాల్లో హీరోగా నటించారు. ఆయనను గుజరాత్ సూపర్ స్టార్ అని పిలుస్తారు. నరేష్ కుమారుడు హితు కనోడియా కూడా గుజరాతీ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈయన దాదాసాహెబ్ పాల్కే అవార్డు కూడా అందుకున్నాడు. అయన సోదరుడు మహేష్ కనోడియా కూడా రెండు రోజుల క్రితమే మృతిచెందారు.
ఈ సందర్భంగా .. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ట్వీట్ చేసి వారికి నివాళులర్పించారు. 'గుజరాతీ ఫిల్మ్ సూపర్ స్టార్, బిజెపి నాయకుడు నరేష్ భాయ్ కనోడియా మరణం చాలా బాధాకరం. సామాజిక కళల రంగంలో ఆయన సేవలు అమూల్యమైనవి. కొత్త తరానికి స్ఫూర్తినిస్తుంది’ అని ట్వీట్ చేశారు. అలాగే దేశ ప్రధాని మోడీ కూడా వీరి మృతికి నివాళ్లు అర్పించారు. అతి తక్కువ సమయంలోనే మహేష్ భాయ్, నరేష్ భాయ్ ను కోల్పోయాం, గుజరాతీ సంస్కృతికి , ప్రజలకి వారు చేసిన సేవలు అంత త్వరగా మరిచిపోలేమని ప్రధాని మోడీ ట్విట్ చేశారు.