Begin typing your search above and press return to search.
టీడీపీలోకి ఇంకో వారసుడు..అదే సీటుపై కన్ను
By: Tupaki Desk | 2 Feb 2019 4:33 PM GMTఏపీ రాజకీయాల్లోకి మరో వారసుడు ఎంట్రీ ఇవ్వనున్నారా? ప‌్రస్తుతం జరుగుతున్న కసరత్తు ఆధారంగా ఈ కొత్త చర్చ తెరమీదకు రానుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ స్థానాలపై దృష్టిపెట్టారు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న తరుణంలో ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి శ్రీనివాస్ కలవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన కీలకమైన టికెట్ ఆశిస్తున్నారని తెలుస్తోంది.
రాయపాటి శ్రీనివాస్ కృష్ణా - గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంపై కన్ను వేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా గత కొద్ది కాలంగా ఆయన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తగు కార్యాచరణ చేపట్టేందుకు ఇవాళ టీడీపీ అధినేతను చంద్రబాబును తన తండ్రి - ఎంపీ రాయపాటి సాంబశివరావుతో కలిసి రాయపాటి శ్రీనివాస్ సమావేశం అయినట్లు సమాచారం. ఈ సందర్భంగా కృష్ణా - గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం తనకు కేటాయించాలని కోరినట్లు తెలిసింది. అయితే, సీఎం చంద్రబాబు పరిశీలిస్తానని రాయపాటి కుటుంబానికి చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. ఇదిలాఉండగా - రాయపాటి శ్రీనివాస్ వైపే టీడీపీ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
మరోవైపు టికెట్ ఆశించేవారు చంద్రబాబును కలుస్తున్నారు. తమ తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో వారి అభిప్రాయాలను వింటున్న చంద్రబాబు తగు హామీ ఇస్తున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా, కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం అభ్యర్థిని చంద్రబాబు రెండు రోజుల్లో ఖరారు చేయనున్నారు.