Begin typing your search above and press return to search.

టీడీపీకి షాక్: అయ్యన్నపై కేసు

By:  Tupaki Desk   |   22 Dec 2019 4:44 AM GMT
టీడీపీకి షాక్: అయ్యన్నపై కేసు
X
టీడీపీ ప్రభుత్వంలో ఆయన ఆడిందే ఆట పాడిందే పాట..కానీ వైసీపీ సర్కారు వచ్చాక కూడా అలానే ఆడుతానంటే కుదురుతుందా కుదరదు కదా.. ఇప్పుడు అదే జరిగింది. పోలీసులను పరుష పదజాలంతో దూషించిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు చిక్కుల్లో పడ్డారు.

పోలీసులను దూషించిన కేసులో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు చేసినట్లు నర్సీపట్నం పట్టణ సీఐ స్వామినాయుడు శనివారం తెలిపారు.

*వివాదం ఇదీ

అయ్యన్నపాత్రుడు సోదరుడు- నర్సీపట్నం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు తన నివాసముంటున్న ఇంటిపైన వైసీపీ జెండా కట్టాడు. దీనిపై అయ్యన్న ఫ్యామిలీ అభ్యంతరం తెలిపింది. ఈనెల 12న ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి రాగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించి అసభ్యంగా తిట్టిన అయ్యన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు.