Begin typing your search above and press return to search.

ఆ పేలుడు వంద అణుబాంబులకు సమానం..!

By:  Tupaki Desk   |   25 Jan 2022 2:48 AM GMT
ఆ పేలుడు వంద అణుబాంబులకు సమానం..!
X
హుంగా టోంగా-హుంగా హాపై అనే చిన్న దీవిలో ఇటీవల అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనతో చాలా దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి ఆయా ప్రభుత్వాలు. అంటే అగ్నిపర్వత విస్ఫోటనం ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇలా అగ్ని పర్వతం బద్దలు కావడం వల్ల చాలా విధ్వంసం జరిగింది. ఇది పేలినప్పుడు దీనికి సంబంధించిన శకలాలు ఒక్కొక్కటి సుమారుగా సముద్రం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో పడినట్లు పరిశోధకులు గుర్తించారు. ఇంత భారీ స్థాయిలో జరిగిన ఈ విస్పోటనానికి సంబంధించి తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన నాసా ఒక ప్రకటనను విడుదల చేసింది. అగ్నిపర్వత విస్ఫోటనం చాలా భయంకరమైనది అని పేర్కొంది. దీని ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ అగ్నిపర్వత విస్ఫోటనం సుమారు వంద అణుబాంబులకు సమానమని నాసా తెలిపింది. గతంలో జపాన్ లోని హిరోషిమాపై వేసిన అణుబాంబుతో పోలిస్తే... ఇప్పుడు జరిగిన అగ్నిపర్వత విస్ఫోటనంలో ఎక్కువ టీఎన్టీల శక్తి విడుదల అయినట్లు పేర్కొంది. జపాన్ లోని హిరోషిమా పై అణుబాంబు దాడి నుంచి సుమారు 15 మెగా టన్నుల టీఎన్టీ వరకు విడుదల అయింది. అయితే తాజాగా ఈ అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా 5 నుంచి 30 మెగా టన్నుల టిఎన్టి విడుదలైన ట్లు నాసా తెలిపింది. దీని ప్రభావంతో సముద్ర జలాలు పూర్తిస్థాయిలో కలుషితం అయినట్లు పేర్కొంది. ఇటువంటి భారీ పేలుడు కారణంగా ఆ దీవిలోని ఈ ప్రాంతమంతా అతలాకుతలమైనట్లు తెలిపింది.

1945లో జపాన్లోని హిరోషిమా నాగసాకిల మీద అణుబాంబు ప్రయోగం జరిగింది. ఈ ప్రయోగంలో ఏకంగా హీరోషిమా అనే నగరం పూర్తిస్థాయిలో దెబ్బతిన్నది. దీని నుంచి కోలుకోవడానికి జపనీయులకు చాలా కాలం పట్టింది. అయితే ఇక్కడ పేలిన అణుబాంబు ప్రభావం కేవలం 15 మెగా టన్నుల టి ఎన్ టి వరకు మాత్రమే ఉందని నాసా తెలిపింది. అయితే తాజాగా అగ్నిపర్వతం పేలుడు కారణంగా 30 మెగా టన్నుల టి ఎన్ టి విడుదల అయినట్లు నాసా చెప్పింది. ఈ పేలుడు ప్రభావం సుమారు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలను కూడా కదిలించినట్లు స్పష్టం చేసింది. ఈ పేలుడుతో అక్కడ ఉండే రెండు గ్రామాలు పూర్తిగా నాశనం అయినట్లు నాసా పరిశోధకులు తెలిపారు. అంతేకాకుండా అక్కడ సమాచార వ్యవస్థ కూడ పూర్తి స్థాయిలో దెబ్బతిన్నదని పేర్కొన్నారు. దీని పునరుద్ధరణకు మరింత సమయం పడుతుందని తెలిపారు.

ఈ విస్పోటనం కారణంగా స్థానికంగా ఉండే సముద్ర జలాలు కలుషితమయ్యాయి. ఈ అగ్ని పర్వతం నుంచి వెలువడిన బూడిద చాలా ప్రాంతాల్లో కప్పివేసింది. అయితే దీని ద్వారా అనేక జబ్బులు అంటు వ్యాధులు రావచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చాలా దేశాల సైనిక దళాలలు స్థానికంగా ఉండే వారికి కొంత బాసటగా నిలుస్తున్నాయి.