Begin typing your search above and press return to search.
భూమికి పెను ముప్పు కొద్దిలో మిస్ అయ్యిందా?
By: Tupaki Desk | 4 July 2019 4:41 AM GMTఇప్పుడు చెప్పే ఉదంతాల గురించి సామాన్యులకు సమాచారం లేకపోతేనే బాగుంటేందేమో? కొన్ని ప్రమాదాల గురించి.. అపాయాల గురించి తెలీకుండా ఉంటే ఉండే ప్రశాంతత అంతా ఇంతా అన్నట్లుగా ఉండదు. తాజాగా బయటకొచ్చిన ఈ ఉదంతం గురించి విన్నప్పుడు కూడా ఇలాంటి భావనే కలుగక మానదు. అనంతమైన ఈ విశ్వంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది.
భూగ్రహానికి నూకలు ఉండటం కారణంగానే ఇప్పటికి ఏమీ జరగట్లేదని చెప్పాలి. అనంత విశ్వసంలో ఎన్నో గ్రహ శకలాలు తిరుగుతుంటాయి. కొన్ని అనుకోకుండా దారి తప్పి.. భూమిని టార్గెట్ చేసేలా దూకుకొస్తుంటాయి. అలాంటి వాటి వల్ల ఏర్పడే ప్రమాదం చాలా ఎక్కువ. కాకుంటే.. మనం చేసుకున్న అదృష్టం కావొచ్చు.. భూమికి డ్యామేజ్ కాకూడదని రాసి ఉందేమో కానీ.. అలాంటి ప్రమాదాలు తృటిలో తప్పిపోతుంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకున్న విషయాన్ని నాసా బయటపెట్టింది.
భూమిని ఢీ కొట్టేందుకు ఒక గ్రహ శకలం దూసుకొచ్చింది. అయితే.. అది కాస్తా భూ వాతావరణంలోకి ప్రవేశించగానే పేలిపోయింది. దీంతో.. భూమికి పెను ముప్పు కొద్దిలో మిస్ అయ్యింది. గ్రహశకలాన్ని పసిగట్టే లైట్నింగ్ డిటెక్టర్ ఒక అసాధారణ చర్యను గుర్తించింది. భూమికి 3.1 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి దూసుకొస్తున్న ఒక గ్రహ శకలాన్ని గుర్తించి అప్రమత్తం అయ్యారు.
ఐదు మీటర్ల పరిమాణంలో ఉన్న ఈ గ్రహశకలం కానీ భూమిని తాకి ఉంటే జరిగే నష్టం భారీగా ఉండేది. అయితే.. భూవాతావరణంలోకి వచ్చినంతనే ఆ గ్రహశకలం కాస్తా పేలిపోయిన వైనాన్ని గుర్తించారు. జూన్ 22న అంతుచిక్కని మెరుపులు కాసేపు చోటు చేసుకున్నాయి. వాటిని విశ్లేషించిన నాసా శాస్త్రవేత్తలకు గ్రహ శకలం పేలిపోయినట్లుగా గుర్తించారు.
ఈ గ్రహశకలం కానీ అదే స్పీడ్ లో వచ్చి భూమిని ఢీ కొడితే మాత్రం పెనుముప్పు వాటిల్లేదు. ప్రమాదానికి ముందు తెలీని విషయం.. ఆ ప్రమాదం తృటిలో తప్పిందన్న ఊహ బాగున్నట్లు అనిపించినా.. దాని గురించి ఆలోచించినప్పుడు.. ఒకవేళ.. అదే కానీ జరిగి ఉంటే? అన్న భావనే ఒళ్లు గగుర్పాటుకు గురయ్యేలా చేస్తుందనటంలో ఎలాంటి సందేహం కలుగక మానదు.