Begin typing your search above and press return to search.

మార్స్ మిషన్.. అంగారక గ్రహం ఆ జాడలు గుర్తించిన నాసా !

By:  Tupaki Desk   |   13 April 2021 11:30 PM GMT
మార్స్ మిషన్.. అంగారక గ్రహం ఆ జాడలు గుర్తించిన నాసా !
X
భూమికి అతి చేరువలో ఉన్న అంగారక గ్రహంపై పరిశోధలు జరుగుతూనే ఉన్నాయి మానవ నివాసానికి యోగ్యమైన పరిస్థితులు ఉన్నాయా? అనే కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన నాసా పర్సీవరెన్స్ రోవర్ ను మార్స్ పై దింపింది. గతకొంతగాలంగా ఇది అధ్యయనం చేస్తోంది.

అంగారకుడిపై నీటి జాడలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ వస్తున్నారు. తాజాగా దీనపిై నాసాకు కీలక సమాచారం లభించింది. కొంతకాలంగా పరిశోధనలు జరుపుతున్న పర్సీవరెన్స్ రోవర్ కీలక డేటాను సేకరించింది. భూమిపై ఉన్న పరిస్థితుల్లోలాగే అంగారకుడిపై తడి, పొడి పరిస్థితులు ఉన్నాయని గుర్చించింది. అందుకు సంబంధించిన చిత్రాలను పంపించింది.

మార్స్ పై ఐయోలిస్ మోన్స్ పర్వతంపై ఈ రోవర్ అద్యయనం చేస్తోంది. తాజాగా ఇది పంపిన చిత్రాలు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఆ ఫొటోల్లో నీరు ఉన్నట్లు శాస్త్రవేత్తలకు నిర్ధారించారు. భూమి మాదిరిగానే వంద లోతులో నీటి ఆనవాళ్లు ఉన్నాయని గుర్తించారు. ఇక అక్కడి నేల, వస్తువులు, నిర్మాణాలూ నీటి జాడలు ఉన్నట్లు సుస్పష్టం చేస్తున్నాయి.

ఈ రోవర్ పంపించిన చిత్రాలపై ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. . మానవ మనుగడకు అవసరమైన పరిస్థితులు అంగారకుడిపై ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అతి త్వరలోనే నీటి జాడను గురించి అదికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.