Begin typing your search above and press return to search.
అద్బుతం.. సూర్యుని వాతావరణాన్ని వీడియో తీశారు
By: Tupaki Desk | 21 Dec 2021 11:44 AM GMTఎన్నో అద్భుతాలకు పుట్టినిల్లు ఈ విశ్వం. మనకు తెలియని ఎన్నో వింతలు విశేషాలను తనలోనే దాచుకుంది. భూమి పైన నుంచి చూస్తే కేవలం పగటి పూట ఆకాశం రాత్రి పూట నక్షత్రాలు చందమామ ఇలా ఎన్నో ఆకారాల్లో ఉండే వివిధ రకాల తారలు... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వాటి అన్నింటి లో ఏదో ఉంది అని నమ్మిన మనిషి.. నేల నుంచి నింగికి నిచ్చెన వేశాడు. ఈ క్రమంలోనే అనేక అనేక ప్రయోగాలకు పురుడు పోశాడు. ఎన్నో వైఫల్యాలు ఎదురైనా తొణక్క బెనక్క అలానే తన పనిని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఇందులో భాగంగానే ముందుగా భూమికి చేరువులో ఉండే చంద్రునిపై కాలు మోపాడు. ఆ తరువాత చాలా రోజులకు మిగతా గ్రహాల మీదకు పోవాలని అనుకున్నాడు. ఇందుకు తగిన ప్రయోగాలు చేశాడు. చివరకు అనుకున్న విధంగా మార్స్ మీదకు కూడా చేరుకున్నడు. అయితే అంతటి ఆగాలని అనించించ లేదు. అందుకే సోలార్ ప్రోబ్ పేరుతో ఓ ప్రయోగం చేపట్టాడు.
సోలార్ ప్రోబ్ అనేది సూర్యుని పై ఉన్న వాతావరణంపై ప్రయోగాలు చేపట్టే ఉపగ్రహం. దీనిని అమెరికా స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ చేపట్టిన ప్రయోగమే ఈ సోలార్ ప్రోబ్. అయితే ఇది ఇటీవల సూర్యుని పొరల్లోకి చొచ్చుకుపోయంది. భగభగ మండే సూర్యుని పొరల్లో నుంచి పుట్టుకు వచ్చిన వేడికి ఇది చిగురుటాకులా వణికింది. కానీ అనుకున్న పనిని పూర్తి చేసింది. ఇంకా చేస్తోంది. భానుడికి వెలుపలి ఆవరణంలో ఉండే కరోనా లోకి ప్రవేసింది. ఇందుకు సంబోధించి ఫోటోలను వెల్లడించింది. సోలార్ మిషన్లో ఉపగ్రహం చాలా అరుదైన ఘట్టాన్ని చేరుకుంది. ఆ ఘట్టాన్ని చేరుకునేటప్పుడు సోలార్ ప్రోబ్ ఓ వీడియోను తీసింది. దీనిని అధికారులు వారి దగ్గర బహిర్గతం చేశారు. రవి ఆవరణలోకి అడుగు పెట్టే మధురమైన అనుభూతలను ప్రోబ్ నిగూఢంగా చిత్రీకరించింది. ప్రస్తుతం ఈ వీడియోను నాసా విడుదల చేసింది. ఇది సోషల్ మీడియోలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియో శాస్త్రవేత్తలకు ఏం చెప్పింది అనేది తెలుసుకుందాం.
ప్రోబ్ తీసిన లాటిలో ముఖ్యమైంది అయస్కాంత్ర క్షేత్రం. ప్రోబ్ అన్నింటి కంటే ముందుగా సౌర కుటుంబంలో మ్యాగ్నటిక్ సెంటర్ ఉందని కనిపెట్టింది. ఈ విషయాన్ని సోలార్ ప్రోబ్ ప్రాజెక్ట్ లో ఉండే పరిశోధకులు నూర్ రౌవాఫీ తెలిపారు. ప్రోబ్ సుమారు సూర్యుని నుంచి 5 మిలియన్ కిమీ మేర దూసుకుపోయిందని అన్నారు. ఈ క్షణాలను 13 సెక్లన నిడివితో టైంలాప్స్ వీడియోను తీసినట్లు వివరించారు. ఈ వీడియోలు రికార్డు అయిన కొన్ని అంశాలు ఆధారంగా శాస్త్రవేత్తలు మరికొంత కీలక పరిశోధనన జరపనున్నట్లు తెలిపారు. ఇది సౌర కుటుంబాన్ని మరింత ఎక్కువగా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.