Begin typing your search above and press return to search.

మరో అద్భుతం చేసిన నాసా..ఏకంగా సూర్యడితో?

By:  Tupaki Desk   |   6 Dec 2019 1:30 AM GMT
మరో అద్భుతం చేసిన నాసా..ఏకంగా సూర్యడితో?
X
నాసా ఏదైనా అనుకోవాలే కానీ - జరగనది ఏది ఉండదు అని మరోసారి నిరూపించింది. నాసా తాజాగా పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నం కనుక విజయవంతం అయితే ఎన్నో సమస్యలకి పరిస్కారం దొరికినట్టే. సుమారుగా గంటకు ఏడు లక్షల కిలోమీటర్ల వేగంతో పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ సూర్య మండలానికి వెళ్లింది. ఈ పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ అనేది సూర్యుడి రహస్యాలు శోధించేందుకు రూపొందించిన రాకెట్‌.

ఈ విశ్వంలో మిస్టరీలను ఒక్కొక్కటిగా ఛేదిస్తున్న మానవుడికి సూర్యుడి దగ్గరికి వెళ్లాలనేది తీరని ఓ కల. ఈ కలను నిజం చేసింది నాసా. 2018 ఆగస్టులో పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ ను సూర్యుడి దగ్గరకు పంపింది. ఈ సోలార్‌ ప్రోబ్‌ సూర్యుడికి 60 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండి పరిశోధనలు చేసేందుకు వెళ్లింది. 2025 ఆగస్టు వరకు ఈ ప్రయోగం కొనసాగనుంది. కారు సైజులో ఉండే పార్కర్‌ ప్రోబ్‌ను డెల్టా-4 రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి పంపించారు.

సూర్యుడి కాంతి వలయం అంటే.. కరోనా నుంచి పార్కర్‌ ప్రోబ్‌ సమాచారం అందిస్తుంది. ఇక్కడ సూర్యుడి నుంచి వెలువడే ఉష్ణం తీవ్రత కాస్త తక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ ఉండి కరోనా నుంచి వెలువడే సౌర తుఫానులపై పరిశోధనలు చేస్తుంది. సౌర తుఫానులు భూమిని తాకితే కమ్యూనికేషన్‌ వ్యవస్థ మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి ఇవి ఎలా పుడతాయి? వేగం ఎలా పెరుగుతుంది? లాంటి ప్రశ్నలకు పార్కర్‌ సమాధానాలు సేకరిస్తుంది. ఈ సమాచారం ఆధారంగా సౌర తుఫాన్ల నుంచి తప్పించుకోడానికి మార్గాలను అన్వేషించవచ్చు.

సూర్యుడిపై ఏర్పడే అసాధారణ అయస్కాంత విస్పోటనమే సౌర తుఫాన్‌. దీన్ని సైంటిస్టులు G 1 నుంచి G5 వరకు ఐదు వర్గాలుగా విభజించారు. G1 అంటే చిన్నపాటి తుఫాన్‌ కాగా.. G 5 భయంకరమైంది. G 5 సంభవిస్తే గనక ఊహించని విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి.