Begin typing your search above and press return to search.

సూర్యుడి గుట్టు చేధించేందుకు 'పార్కర్'

By:  Tupaki Desk   |   12 Aug 2018 6:48 AM GMT
సూర్యుడి గుట్టు చేధించేందుకు పార్కర్
X
ఎండాకాలంలో 50 డిగ్రీల ఎండకే మనం మాడిపోతాం.. అదే మనం సూర్యుడి దగ్గరికి వెళితే ఇంకేమైనా ఉందా.? మలమల మాడిపోము.. అందుకే ఇన్నేళ్లు అయినా సూర్యుడు అలా ఎందుకు భగభగ మండిపోతాడు.. ఆ సూరీడు నుంచి వచ్చే సౌర తుఫాన్లు ఎలా చెలరేగుతాయి.. ఆ తుఫాన్లతో మన ఉపగ్రహ వ్యవస్థ ఎందుకు దెబ్బతింటోంది.. మొత్తంగా సూర్యుడి ఉపరితలంపై ఏం జరుగుతుందనేది మానవాళికి అంతుచిక్కలేదు. శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసినా సూర్యుడి గుట్టు వీడలేదు. కానీ ఇప్పుడు వీడబోతోంది.

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సూర్యడికి అత్యంత సమీపంలోకి అత్యంత శక్తివంతమైన ‘పార్కర్’ శోధక నౌక ప్రయోగాన్ని ఈ రోజు చేసింది.. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ శనివారం ప్రయోగం జరగాలి. కానీ పలు సాంకేతిక కారణాల వల్ల ప్రయోగాన్ని ఆదివారం మార్చారు. దాదాపు లక్ష కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి డెల్టా4 హెవీ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పార్కర్ వెళ్లిపోయింది. కానీ ఇది సూర్యుడు దగ్గరకు నేరుగా వెళ్లకుండా మొదటి బుధ గ్రహం చుట్టూ ఏడు చక్కర్లు ఆ తర్వాత సూర్యడికి కేవలం 40లక్షల కిలోమీటర్ల సమీపానికి వెళుతుంది.

పార్కర్ శోధక నౌకలో ఉండే శక్తివంతమైన పరికరాలున్నాయి. ఇది ఆరేళ్లపాటు సూర్యుడి చుట్టూ తిరుగుతూ నిగ్గు తేల్చబోతోంది. సూర్యూడి నుంచి వెలువడే రేడియో ధార్మిక కిరణాలను గుర్తించనుంది. సూర్యుడి ధూళి కణాలను సేకరించనుంది.

కాగా సూర్యుడి అఖండ వేడిని తట్టుకునేలా పార్కర్ ను రూపించారు. దాదాపు 8 అడుగుల వ్యాసం - నాలుగున్నర అంగుళాల మందమున్న కార్బన్ మిశ్రమ లోహంతో ఉష్ణ కవచాన్ని తయారు చేశారు. ఇది దాదాపు సూర్యుడి నుంచి వెలువడే 1371 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. దీంతో దీనికి ఏమీ కాదు.. ఉష్ణం బయటకు రాకుండా మిగతా భాగాలకు ప్రసరించకుండా శోషించుకునేలా తయారు చేశారు. దీంతో లోపల ఉండే ఎలక్ర్టానిక్ పరికరాలకు ఏమీ కాదు.. 1958లో సౌరతుఫానుల ఉనికికి మొదట కనిపెట్టిన శాస్త్రవేత్త యుజీన్ పార్కర్ కృషికి గుర్తింపుగా ఈ నౌకు పార్కర్ అని నాసా శాస్త్రవేత్తలు పేరు పెట్టారు.