Begin typing your search above and press return to search.
భూమిలో బంగారం ఎలా ఏర్పడిందో తెలుసా?
By: Tupaki Desk | 19 May 2020 12:30 AM GMTఈ భూమి మీదే విలువైన ఖనిజం.. బంగారం.. బంగారం అంటే అందరికీ పిచ్చే.. ముఖ్యంగా ఆడవారికి అదంటే ప్రాణం.. మగవారు కూడా చేతులకు ఉంగరాలు.. మెడలో చైన్లుగా దీన్ని వేసుకుంటారు. హోదాకు, పరపతికి సింబాలిక్ గా బంగారంను అందరూ వేసుకుంటారు.
దేశంలో బంగారానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు.. అందుకే పది గ్రాముల బంగారం ధర 40వేలపైనే ఉంది.మరి అసలు ఈ బంగారం భూమిలో ఎలా ఏర్పడింది? అది ఎక్కడ పుట్టుకు వచ్చింది.? లాంటి వాటిపై నాసా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
భూగ్రహం ఏర్పడే సమయంలో చంద్రుడి పరిణామం గల ఒక భారీ గ్రహ శకలం భూమిని ఢీకొని దానిలోకి చొచ్చుకుపోయిందని.. ఆ తర్వాత అది భూ అంతర్భాగంలో పలు ప్రక్రియలకు గురై బంగారం, ప్లాటినం లాంటి లోహాలుగా మారిందని తాజాగా పరిశోధనలో శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
భూమిలో బంగారం, ప్లాటినమే కాదు.. ఇతర లోహాలు కూడా ఇలానే ఏర్పడ్డాయని సైంటిస్టులు తేల్చారు. అయితే ఇప్పుడు మనం వెలికితీసిన బంగారం కంటే భూమిలో 5 రెట్లు ఎక్కువగా బంగారం ఉందని.. గుర్తిస్తే దాన్ని వెలికి తీసుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.