Begin typing your search above and press return to search.

మార్స్ పై అంగుళం లోతు లో నీళ్లు .. సేఫ్ లాండింగ్ కోసం నాసా ప్రయత్నం !

By:  Tupaki Desk   |   14 Dec 2019 6:43 AM GMT
మార్స్ పై అంగుళం లోతు లో నీళ్లు .. సేఫ్ లాండింగ్ కోసం నాసా ప్రయత్నం !
X
అంగారక గ్రహం పై నీళ్లున్నాయా? ఈ ప్రశ్న పైనే చాలా మంది సైంటిస్టులిప్పుడు పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటి కే నాసా పంపిన క్యూరియాసిటీ రోవర్, మార్స్పై కలియ తిరుగుతూ నీటి కోసం రీసెర్చ్ చేస్తుంది. అయితే, మార్స్లో ఒకప్పుడు నీళ్లుండేవని, అవన్నీ ఇప్పుడు పోయాయని సైంటిస్టులు గత కొద్ది రోజులుగా చెప్తున్నారు. కానీ, తాజాగా మార్స్ గ్రహం మీద మంచు ప్రదేశాల ను కనుగొన్నట్లు నాసా తెలిపింది. అది కూడా అంగారక గ్రహం ఉపరితలం నుంచి కేవలం ఒక అంగుళం లోతులో మాత్రమే ఉన్నాయట.

అలాగే మార్ష్ పై కేవలం రెండు అడుగుల లోతులోనూ నీళ్లు గడ్డ కట్టి ఉన్నట్టు గుర్తించారు. ధ్రువాలతో పాటు మధ్య అక్షాంశాల వద్ద కూడా నీటి జాడను కనుగొన్నారు. నాసా మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్, మార్స్ ఒడిస్సీ ఆర్బిటర్లు తీసి పంపిన ఫొటోలు, సేకరించిన సమాచారం ఆధారంగా సైంటిస్టులు ఈ విషయాన్ని నిర్దారించారు. దీనితో నాసా తన వ్యోమగాములను అంగారక గ్రహానికి పంపడానికి సురక్షిత ల్యాండింగ్ ప్రదేశాలను కనుగొనే ప్రయత్నంలో ఉంది.

అంగారక గ్రహం మీద నీటి మంచును కనుగొన్నప్పటి కీ ఇంకా పని పూర్తి కాలేదు. వివిధ సీజన్ల లో అక్కడి మార్పును చూడటానికి పరిశోధకులు అంగారక గ్రహంపై భూగర్భ నీటి మంచు అధ్యయనం కొనసాగించాలని కోరుకుంటారు. ఇది భవిష్యత్ మార్స్ మిషన్ ప్లానర్లకు మరింత సహాయ పడుతుంది అని భావిస్తున్నారు. మార్ష్ పై కేవలం రెండు అడుగుల లోతులోనూ నీళ్లు మంచురూపంలో ఉన్నాయి. కాబట్టి సాఫ్ట్ ల్యాండింగ్ ప్రదేశాల కోసం ఏజెన్సీకి ఇప్పటి కే కొన్ని ప్రదేశాలని పరీక్షిస్తుంది. కానీ , 2030 కు ముందు మానవ సహిత అంగారక యాత్ర చేపట్టకపోవచ్చు అని లెస్లీ తెలిపారు.