Begin typing your search above and press return to search.

అరుదైన అవకాశం.. చంద్రుడిపైకి వెళ్లనున్న మనోడు

By:  Tupaki Desk   |   11 Dec 2020 10:37 AM GMT
అరుదైన అవకాశం.. చంద్రుడిపైకి వెళ్లనున్న మనోడు
X
అల్లంత దూరాన ఉన్న చందమామ అంటే.. మనిషికి ఎంతో క్రేజ్. అతడి దగ్గరకు వెళ్లాలని.. అక్కడేదో వెతకాలని.. అక్కడ స్థిర నివాసానికి అనువుగా ఆవాసాన్ని సెట్ చేయాలన్న కోరికలుచాలానే ఉన్నాయి. క్యాలెండర్లో ఏళ్లకు ఏళ్లు గడిచినా.. ఇప్పటివరకు సాధించింది చాలా తక్కువే. ఒకదశలో చందమామ మీదకు వెళ్లటం లాభసాటి వ్యవహారం కాదన్న మాట వినిపించేది. ఇలాంటివేళ.. భారత్ జరిపిన చంద్రయాన్ మలుపు తిప్పటమే కాదు.. చంద్రుడి మీద నీటి జాడల్ని కనుగొనటంతో మరోసారి చంద్రుడి చుట్టూ ప్రయోగాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

చందమామపై మానవసహిత నౌకను పంపేందుకు నాసా సంస్థ ఒక మిషన్ చేపట్టింది. ఇందులో భారత సంతతికి చెందిన ఒక వ్యక్తికి అరుదైన అవకాశం లభించింది. 43 ఏళ్ల రాజా జాన్ వుర్పుత్తూర్ చారి అనే భారత సంతతి వ్యక్తిని అరుదైన అవకాశం లభించింది. ఈ మిషన్ కు ‘‘ఆర్టిమిస్’’ అనే పేరును డిసైడ్ చేశారు. చంద్రుడి వద్దకు మనుషుల్ని చేర్చే ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో మనోడికి అవకాశం లభించటం అరుదైన విషయంగా చెప్పాలి. తన తల్లిదండ్రుల ఉత్తమ పెంపకం తనకీ అవకాశం లభించిందని రాజా చారి తన స్పందనను తెలియజేశారు.

ఆయన గురించిన వివరాల్ని నాసా తన సోషల్ మీడియా పేజీలో ప్రచురించటంతో ఆయన ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ప్రఖ్యాత మస్సాచ్యుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. అమెరికా ఎయిర్ ఫోర్స్ అకాడమీ.. యూఎస్ నేవల్ టెస్టు పైలెట్ స్కూల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. 2017లో నాసాలో చేరిన ఆయన.. చారిత్రక మూన్ ప్రాజెక్టు కు ఎంపికయ్యారు.

ఈ మెషిన్ లో మరో కీలకాంశం ఏమంటే.. ఒక మహిళను కూడా పంపుతున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. చంద్రుడి మీద మహిళ కాలు మోపుతున్న రికార్డును సొంతం చేసుకోనున్నారు. మొత్తం 18 మంది పాల్గొనే ఈ మెషీన్ లో దాదాపు సగం మంది మహిళలే కావటం విశేషంగా చెప్పాలి. ఇలాంటి ప్రోగ్రాంలో మనోడు భాగస్వామి కావటం మనందరికి సంతోషాన్ని కలిగించే అంశంగా చెప్పక తప్పదు.