Begin typing your search above and press return to search.
తిరుమలకు వెళతారనే వాళ్లకు.. నాసా సెంటిమెంట్ తెలిస్తే ఏమంటారో?
By: Tupaki Desk | 10 July 2022 4:09 AM GMTఅంతరిక్ష ప్రయోగాల విషయంలో కీ రోల్ ప్లే చేసిన శ్రీహరికోటకు చెందిన శాస్త్రవేత్తలు.. ఇస్రో అధినేత ఎవరైనా సరే.. తమ రాకెట్ ప్రయోగానికి ముందు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి.. వచ్చిన తర్వాతే రాకెట్ ప్రయోగాలు చేయటం తెలిసిందే. దీనిపై బోలెడన్ని ఎటకారాలు.. మరెన్నో పంచ్ లు వేసేటోళ్లు చాలామందే కనిపిస్తారు. అలాంటి బ్యాచ్ మాటలు సూదుల మాదిరి గుచ్చేస్తుంటాయి. అలాంటి వారికి సమాధానం చెప్పేందుకు వీలుగా ప్రపంచ అంతరిక్ష ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే నాసా సెంటిమెంట్ గురించి తెలిస్తే ఇంకేమంటారో?
ఇస్రో నమ్మకాన్ని చాదస్తంగా అభివర్ణించే మేధావి వర్గం.. నాసా శాస్త్రవేత్తల సెంటిమెంట్ మరింత విచిత్రంగా ఉంటుంది. ఇస్రో శాస్త్రవేత్తలు ఏ రీతిలో అయితే.. తమ ప్రయోగానికి ముందు దాని నమూనాతో శ్రీవారి దర్శనం చేసుకుంటారో.. అదే రీతిలో ప్రయోగం ఏదైనా సరే.. దాన్ని ప్రయోగించటానికి ముందు వేరుశెనగలు తినే అలవాటు నాసా శాస్త్రవేత్తల్లో కనిపిస్తుంటుంది. ఇళా చేస్తే.. ప్రయోగం సక్సెస్ అవుతుందని బలంగా నమ్మటం గమనార్హం.
ఎందుకిలా అంటే దానికో కారణాన్ని చూపుతారు నాసా శాస్త్రవేత్తలు. 1960లో రేంజర్ 7 అనే విమాన ప్రయోగాన్ని ఆరుసార్లు ప్రయోగించటం ఫెయిల్ కావటం జరిగింది. అయినప్పటికీ ఏడోసారి దాన్ని రూపొందించి ప్రయోగానికి సిద్ధం చేశారు. ఆరుసార్లు ఫెయిల్ అయి.. ఏడోసారి ప్రయోగం ఏమవుతుందా? అన్న టెన్షన్ అక్కడి వారిలో ఉంది. ఇలాంటి వేళ.. వారిలోని ఒక సైంటిస్టు ఒకరు పల్లీలు చేతికి ఇచ్చి.. వీటిని తింటూ ఉండండి.. మీకు టెన్షన్ తగ్గుతుందని చెప్పటం ఒక ఎత్తు అయితే.. ఆ ప్రయోగం సక్సెస్ అయ్యింది.
అప్పటి నుంచి తాము ఏదైనా ప్రయోగాన్ని నిర్వహించే ముందు శెనగల్ని తినటం ఒక ఆచారంగా ఎంచుకున్నారని చెప్పాలి. ఏదైనా మిషన్ ను లాంచ్ చేసే సమయంలో శెనగలు తింటే అంతా మంచి జరుగుతుందని భావిస్తారు. అందుకే ప్రయోగ వేళ.. ఎన్ని పనులు ఉన్నా.. దాన్ని ప్రయోగించే ముందు మాత్రం వేరుశెనగల్ని తింటూ ఉంటారు. ఈ వేరు శెనగల సెంటిమెంట్ తో పోలిస్తే.. తిరుమల శ్రీవారి దర్శనం బెటర్ గా అనిపిస్తుంది కదూ?