Begin typing your search above and press return to search.
స్పేస్ ఎక్స్ విజయం..నింగిలోకి వ్యోమగాములు
By: Tupaki Desk | 31 May 2020 4:12 AM GMTఅంతరిక్ష ప్రయోగాల్లోనే అద్భుతం ఆవిష్కారమైంది. ఓ ప్రైవేటు సంస్థకు చెందిన రాకెట్ ఇద్దరు నాసా వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎన్ఎస్) తీసుకెళ్లింది. ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే సంస్థలే ఇన్నాళ్లు ఈ పనిచేసేవి. కానీ స్పేస్ ఎక్స్ అనే ప్రైవేటు సంస్థ తొలిసారి ఈ ప్రయోగం చేసి విజయవంతమైంది.
ఈ ప్రయోగానికి ముందు స్పేస్ ఎక్స్ సంస్థ రాకెట్ పేలిపోవడంతో అందరిలోనూ ఈ యాత్రపై ఉత్కంఠ మొదలైంది. దీంతో పకడ్బందీగా మరో రాకెట్ ద్వారా వ్యోమగాములను స్పేస్ ఎక్స్ సంస్థ పంపించడం విశేషం. తొమ్మిదేళ్ల తర్వాత అమెరికా గడ్డపై నుంచి వ్యోమగాములు ఐఎస్ఎస్ కు వెళ్లడం ఇదే తొలిసారి. బుధవారం జరగాల్సిన ఈ ప్రయోగం వాతావరణం సరిగా లేక ఈరోజుకు వాయిదా పడింది.
నాసా ఆధ్వర్యంలో ఫ్లోరిడాలో కెన్నడీ స్పేస్ స్టేషన్ నుంచి శనివారం ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. స్పేస్ ఎక్స్ అనే ప్రైవేటు సంస్థ రూపొందించిన ఫాల్కన్ 9 అనే రాకెట్ ద్వారా డగ్లస్ హార్లీ - రాబర్ట్ బెంకెన్ అంతరిక్షంలోకి ప్రయాణమయ్యారు. దాదాపు 19 గంటల తర్వాత వీరు ఐఎస్ఎస్ కు చేరుకోనున్నారు. అక్కడ ఉన్న రష్యా వ్యోమగాములు అనాటోలీ ఇవానిషిన్ - ఇవాన్ వాగ్నెర్ - అమెరికా వ్యోమగామి క్రిస్ కాసిడీలను కలుసుకోనున్నారు.
చాలా వైఫల్యాల తర్వాత విజయం వరించడంతో స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తమ ప్రతీ ఒక్కరి కల అని తెలిపారు. ఈ ప్రయోగాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలువురు అధికారులతో కలిసి వీక్షించారు.
అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ‘అమెరికా గడ్డపై నుంచి అమెరికా రాకెట్లలో అమెరికా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాం’ అని ట్రంప్ పేర్కొన్నారు.