Begin typing your search above and press return to search.

చంద్రుడిపైకి ఒరియన్ క్యాప్సుల్.. 50 ఏళ్ల రికార్డు బ్రేక్..!

By:  Tupaki Desk   |   22 Nov 2022 11:30 PM GMT
చంద్రుడిపైకి ఒరియన్ క్యాప్సుల్.. 50 ఏళ్ల రికార్డు బ్రేక్..!
X
అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికా మరోసారి సత్తా చాటింది. 50 ఏళ్ళ కిత్రం చంద్రుడిపైకి అపోలో మిషన్ పేరుతో మానవుడిని పంపించి కొత్త చరిత్రకు నాంది పలికింది. ఆ తర్వాత ఎన్నో అంతరిక్ష ప్రయోగాలు చేపట్టినా చంద్రుడి జోలికి మాత్రం వెళ్లలేదు. మళ్లీ ఇన్నాళ్లకు నాసా ఒరియన్ క్యాప్సుల్ రాకెట్ ను చంద్రుడిపైకి పంపించి తన రికార్డును తానే బ్రేక్ చేసింది.

ఒరియన్ క్యాపుల్స్ ప్రాజెక్టు కోసం నానా 4.1 బిలియన్లను ఖర్చు చేసింది. డమ్మి ఆస్ట్రోనాట్లను అమర్చి ఒరియన్ క్యాప్సుల్ రాకెట్లను నింగిలోకి పంపించింది. డమ్మి ఆస్ట్రోనాట్లను అంతరిక్షంలోకి పంపించడం ఇదే తొలిసారి. సెకనుకు 160 కిలో మీటర్ల వేగంతో ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్షం నుంచి ఒరియన్ క్యాప్సుల్ రాకెట్ దూసుకెళ్లింది.

అయితే ఈ రాకెట్ ను నింగిలోకి పంపిన తర్వాత కొద్దిసేపు సాంకేతిక లోపం వచ్చింది. దీంతో నాసాకు రాకెట్ కు మధ్య తొలుత కమ్యూనికేషన్ సమస్య ఏర్పడటంతో శాస్త్రవేత్తల్లో ఆందోళన నెలకొంది.

అరగంట తర్వాత ఒరియన్ క్యాప్సుల్ రాకెట్ చంద్రుడి అవలి వైపు నుంచి ఒక ఫోటోను నాసాకు పంపించడంతో ప్రయోగం విజయవంతమైందని సైంటిస్టులు ప్రకటించారు..

నాసాకు రాకెట్ మధ్య తిరిగి సంబంధాలు ఏర్పడటంతో ఈ ప్రయోగం విజయవంతమైందని ఒరియన్ ప్రొగ్రామ్ మేనేజర్ హోవర్డ్ హ్యూ తెలిపారు. ఒరియన్ క్యప్సూల్ రాకెట్ భూమికి 3 లక్షల 70వేల కిలోమీటర్ల ఎత్తులో చంద్రుడి కక్ష్యలో తిరుగుతుందని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియోను వివరాలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇకపోతే అమెరికా తొలిసారి 1972లో చంద్రుడిపైకి అపోలో మిషన్ ద్వారా మానవులను పంపించింది. ఈ సంఘటన జరిగిన 50ఏళ్ల తర్వాత డమ్మి ఆస్ట్రోనాట్లను అమర్చి ఒరియన్ క్యాప్సుల్ రాకెట్లను అమెరికా పంపించడం విశేషం. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో మానవ సహిత ప్రయోగం చేపట్టే అవకాశాలు మరింత మెరుగయ్యాయని ఆయన వెల్లడించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.