Begin typing your search above and press return to search.

చరిత్ర సృష్టించిన నాసా..మార్స్‌పై చక్కర్లు కొడుతున్న హెలికాప్టర్‌ !

By:  Tupaki Desk   |   20 April 2021 6:30 AM GMT
చరిత్ర సృష్టించిన నాసా..మార్స్‌పై చక్కర్లు కొడుతున్న హెలికాప్టర్‌ !
X
మార్స్ పై హౌస్ డిజైన్లు ఇప్పటికే సిద్ధం అయ్యాయి. ఇక మనిషి అక్కడ కాలుమోపడమే ఆలస్యం. మరి అది అంత సులువేనా, మార్స్‌ నుంచి పంపిన నాసా రోవర్‌ పర్సెవరెన్స్‌ ఇప్పటి వరకు పంపిన డేటా ఏం చెబుతోంది. అసలు అంగారకుడిపై కాలనీ నిర్మించడం సాధ్యమేనా, అందినట్లే అందుతూ.. అంతు చిక్కని గ్రహం.. అరుణగ్రహం.. అంగారకుడిపై జీవపు ఆనవాళ్లను తెలుసుకునేందుకు అమెరికాకు చెందిన నాసా మార్స్ రోవర్‌ పర్సెవరెన్స్ ‌ను వదిలింది. అబిబో లాంటి కంపెనీలు మార్స్‌ పై కాలనీలు నిర్మించాలంటే పర్సెవరెన్స్‌ లాంటి రోవర్‌ లు పంపే డేటా ,చాలా కీలకం. అంగారకుడిపై మానవాళి జీవించగలరా, అసలు అక్కడ ఇంతకు ముందే జీవం ఉనికి ఉందా, ఉంటే అవి ఎలా మనుగడ కొనసాగిస్తున్నాయి, అన్న కోణంలో శాస్త్రవేత్తలు ప్రస్తుతం పరిశోధనలు జరుపుతున్నారు.

రోవర్‌ను దిగ్విజయంగా దింపడమే చాలా గొప్ప విషయం అనుకుంటే, ఈ ప్రయోగంలో మరో మైలురాయిని చేరుకుంది నాసా. మార్స్ పై హెలికాప్టర్ ను చక్కర్లు కొట్టించి అద్భుతం సృష్టించింది. భూమిపై తప్ప మరే గ్రహంపైనా ఎగరని హెలికాప్టర్ ను మార్స్ లో తిప్పింది నాసా. దీనికి సంబంధించిన ఫోటో విడుదల చేసింది. మార్స్ పై హెలికాప్టర్లు, విమానాలు ఎగిరేందుకు ఎలాంటి అవకాశం ఉందొ తెలుసుకోవడం కోసం ఈ ప్రయోగం చేపట్టింది నాసా. 19న తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అక్కడ హెలికాప్టర్ ఎగిరింది. అంగారక గ్రహం-భూమికి మధ్య దూరం 28 కోట్ల కిలోమీటర్లు ఉంది. మార్స్ హెలికాప్టర్‌ను జెపిఎల్ నిర్మించింది. నాసా ప్రధాన కార్యాలయానికి టెక్నికల్ ప్రాజెక్టును ఈ సంస్థనే ఇచ్చింది. నాసా సైన్స్ మిషన్ డైరెక్టరేట్, ఏరోనాటిక్స్ రీసెర్చ్ మిషన్ డైరెక్టరేట్, స్పేస్ టెక్నాలజీ మిషన్ డైరెక్టరేట్ ఇందుకు అంగీకారం తెలిపాయి. నాసాలోని అమెస్ రీసెర్చ్ సెంటర్, లాంగ్లీ రీసెర్చ్ సెంటర్ దీన్ని అభివృద్ధి చేశాయి. విమాన పనితీరు విశ్లేషణ సాంకేతిక సహాయాన్ని అందించాయి. భూమిపై హెలికాప్టర్లు ఎగరడం సులువే కానీ మార్స్‌ పై కష్టం.

అయితే, హెలికాప్టర్ గాలిలో ఎగరడంతో ఊపిరిపీల్చుకున్న పరిశోధకులు. పెర్సెవరాన్స్ రోవర్ పంపినప్పుడే హెలికాప్టర్ ను నాసా పంపించింది. ఏప్రిల్‌ 8 న రోవర్‌లో నుంచి తన రెక్కలను విప్పుకుని బయటకు వచ్చిన బుల్లి హెలికాప్టర్ ఇన్‌ జెన్యూనిటీ. ఈ హెలికాప్టర్ బరువు 1.8 కేజీలు మాత్రమె. 30 రోజుల పాటు మార్స్‌పై చక్కర్లు కొట్టనున్న హెలికాప్టర్. దీనిని ఎగిరేందుకు సిద్ధం చేయడానికి పట్టిన కాలం మాత్రం ఆరు రోజుల నాలుగు గంటలు. ఇక అక్కడి వాతావరణాన్ని ఈ హెలికాప్టర్‌ తట్టుకోవడం మరో టాస్క్‌. రాత్రి వేళల్లో అక్కడ మైనస్‌ 90 డిగ్రీ సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. దానిని కూడా తట్టుకుంది ఈ హెలికాప్టర్. మార్స్‌పై 10 ఫీట్ల ఎత్తు వరకు ఈ హెలికాప్టర్ ఎగిరింది. ఈ హెలికాప్టర్ లో నావిగేషన్‌ వ్యవస్థతో పాటు.. అత్యాధునిక కెమెరాలు ఉన్నాయి. ఇది పంపే డేటాను కూడా విశ్లేషిస్తే.. మార్స్‌ను మరింత అర్థం చేసుకోవచ్చనేది సైంటిస్టులు చెప్తున్నారు. దీనితో ఏం చేస్తారు అంటే .. పురాతన సూక్ష్మజీవుల ఉనికి పై విశ్లేషణ చేస్తారు. అక్కడ జీవజాలం ఉందా లేదా ఉంటే ఎలా ఉంది..ఎంత కాలం కిందట ఉందనే అంశాల పై పరిశోధనలు చేస్తారు. వివిధ సంకేతాల అన్వేషణతో అంగారక గ్రహం లెక్కలు తెలనున్నాయి. అక్కడున్న భూగర్భం, వాతావరణాన్ని నాసా విశ్లేషిస్తుంది. అక్కడ విరిగిపోయి ఉన్న రాళ్లు, దుమ్మును సేకరిస్తున్న నాసా. నాసా మిషన్లు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహకారంతో పరిశోధన చేస్తోంది. అక్కడి ఉపరితలం నుండి సేకరించిన మట్టి పై లోతైన విశ్లేషణ సాగిస్తోంది. భూమికి తిరిగి రావడానికి అంగారక గ్రహానికి నాసా మరో శాటిలైట్ ను పంపించనుంది. 1.8 కేజీల బరువు మాత్రమే ఉన్న ఈ హెలికాప్టర్‌.. 30 రోజుల పాటు మార్స్‌పై చక్కర్లు కొట్టనుంది.