Begin typing your search above and press return to search.
ఒబామాకు నాసా మర్చిపోలేని గిఫ్ట్
By: Tupaki Desk | 15 Jan 2017 8:15 AM GMTమహా అయితే మరో ఐదంటే ఐదు రోజులు అమెరికా అధ్యక్షుడి ఉండనున్నారు బరాక్ ఒబామా. ఈ నెల 20న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. రెండు దఫాల కంటే ఎక్కువసార్లు అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం లేని నేపథ్యంలో.. అధ్యక్ష ఎన్నికల బరిలో లేని ఒబామా.. ట్రంప్ సంచలన విజయంతో ఆయన తన పదవి నుంచి వైదొలగనున్నారు.
అధ్యక్షుడి పదవీ విరమణ సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. వీడ్కోలు పార్టీల హడావుడి పెరుగుతోంది. అయితే.. మిగిలిన వారి మాదిరి కాకుండా ఒబామాకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ను ఇచ్చింది నాసా. అంగారక గ్రహంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతకం చేసిన అల్యూమినయం ఫలక ఫోటోను మార్స్ క్యూరియాసిటీ రోవర్ ఫోటో తీసి పంపింది.
అంగారక గ్రహం మీద క్యూరియాసిటీ రోవర్ పరిశోధనలు జరుపుతున్న సంగతి తెలిసిందే. రోవర్ కు సంబంధించిన పరికరంపై ఒబామా సంతకంతో కూడిన ఫలకాన్ని ఫోటో తీశారు. ఇందులో ఒబామా సంతకంతో పాటు.. అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్.. ఇతర కీలక అధికారుల సంతకాలున్నాయి. అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్న ఒబామాకు ఆయన ఎప్పటికి మర్చిపోలేని గిఫ్ట్ ను నాసా ఇచ్చిందని చెప్పక తప్పదు.