Begin typing your search above and press return to search.
కమల్ హాసన్ ని ఎవరూ ఇంత దారుణంగా తిట్టలేదు
By: Tupaki Desk | 19 Feb 2019 12:15 PM GMTలౌకిక వాదంపై తరచూ మాట్లాడే ప్రముఖుల్లో ఉత్తరాది నటుల్లో చాలా మంది ఉన్నా... దక్షిణాది నటుల్లో మాత్రం కమల్‌హాసన్ - ప్రకాష్ రాజ్ ముందు వరుసలో ఉంటారు. అయితే, తనకు నచ్చింది - తాను నమ్మింది మాట్లాడటంలో ఏ మాత్రం వెనుకడుగు వేయని కమల్ హాసన్ ను - ఆయనతో పాటు బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షాను కేంద్ర మంత్రి - బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ తీవ్రంగా విమర్శించారు.
ఇండియాలో కొందరు లౌకిక వాదుల ముసుగులో ముస్లిం మతం పెరుగుదలకు దోహదం చేస్తూ హిందూమతంపై కక్ష కట్టారని వ్యాఖ్యానించిన గిరిరాజ్ ప్రముఖ నటులు నసీరుద్దీన్ షా - కమల్ హాసన్ లు ఇండియాలో ఇస్లాం వ్యాప్తికి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. పుల్వామా ఘటనతో యావద్దేశం పాకిస్థాన్ వ్యతిరేక భావోద్వాగాలతో రగిలిపోతోంది. కానీ నసీరుద్దీన్ షా - కమల్ మాత్రం జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ ఇండియాకు ద్రోహం చేస్తున్నారని... ఇండియాలో ఇస్లామీకరణ వ్యాప్తికి తమ వంతు కృషిచేస్తున్నారని ఆయన అన్నారు.
ఒక కేంద్ర మంత్రి మరీ ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గిరిరాజ్ అంతటితో ఆగలేదు. అసలు ఇండియాలో ముస్లిం జనాభా పెరగకుండా చట్టం తీసుకురావాలని ఘాటైన డిమాండ్ చేశారు. పాకిస్తాన్ వాళ్లు ఇండియాను ఇస్లాం దేశంగా మార్చాలని కోరుకుంటున్నారు... దానికి కమల్ వంటి వారు దోహదం చేస్తున్నారని అని గిరిరాజ్ అన్నారు. అయితే గిరిరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదేం కొత్త కాదు. ఆయన తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ ఈసారి కమల్ హాసన్ తదితర నటులపై తన బాణం ఎక్కుపెట్టారు.