Begin typing your search above and press return to search.

టీమిండియా..నయా స్టార్ నటరాజన్

By:  Tupaki Desk   |   7 Dec 2020 8:46 AM GMT
టీమిండియా..నయా స్టార్ నటరాజన్
X
ఐపీఎల్​ 2020లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ తరఫున ఆడిన నటరాజన్​ .. ఎంతో మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నటరాజన్​కు సోషల్​మీడియాలో ఎందరో అభిమానులు ఉన్నారు. అయితే అతడు అనూహ్యంగా భారతజట్టుకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా టూర్​కు వెళ్లాడు. తొలుత చాలామంది నటరాజన్​ ఎంపిక పట్ల విమర్శలు గుప్పించారు. అతడు ఏ మేరకు రాణిస్తాడోనని అన్నారు. కానీ నటరాజన్​ మాత్రం టీ20 సీరిస్​లో తన బౌలింగ్​తోనే విమర్శకుల నోర్లు మూయించాడు. సాధారణంగా ఏ బౌలర్​ అయిన ప్రారంభంలో భయపడతాడు. తనను తాను నిరూపించుకోవలన్న తపనతో తప్పులు చేస్తుంటారు. దారాళంగా పరుగులు ఇస్తుంటారు.

తొలి సారి ఇంటర్​నేషనల్​ మ్యాచ్​లో ఆడే ఏ బౌలర్​కు కైనా అటువంటి ఇబ్బంది ఉంటుంది. కొందరు బౌలర్లు మాత్రమే స్టాటింగ్​ ట్రబుల్స్​ను ఎదుర్కొంటూ ఉంటారు. నటరాజన్​ కూడా ఆ కొందరి దారిలోనే వెళ్తున్నాడు. ఏ మాత్రమ బెరుకు లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. కీలక వికెట్లు తీస్తూ.. లో యార్కర్​బాల్స్​ వేస్తూ అదరగొడుతున్నాడు. గత రెండు టీ20 మ్యాచ్​ల్లోనూ నటరాజన్​ మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. ఏ మాత్రం ఒత్తిడి లేకుండా బంతులను విసురుతున్నాడు.

జ‌హీర్, ఇషాంత్, బుమ్రా బౌలర్లు తొలి నుంచి రాణించారు. ప్రస్తుతం నటరాజన్​ కూడా ఆ జాబితాలోకి వెళ్లినట్టే కనిపిస్తుంది. ఈ ఆస్ట్రేలియా టూర్​ భారత బౌలర్లు బుమ్రా, షమీ పెద్దగా రాణించడం లేదు. కానీ నటరాజన్​ మాత్రం విభిన్నంగా బౌలింగ్​ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. సిడ్నీలో ఆదివారం జరిగిన మ్యాచ్​లో నటరాజన్​ బౌలింగ్​ సీనియర్​ క్రికెటర్లను సైతం ఆబ్బుర పరిచింది. నిజానికి ఈ స్టేడియం బౌలింగ్​కు అనుకూలంగా లేదు. చేయి తిరిగిన ఆస్ట్రేలియా బౌలర్లు సైతం పరుగులు సమర్పించుకున్నారు.కానీ నటరాజన్​ నాలుగు ఓవర్లు వేసి కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో ‘భారతజట్టుకు మరో ఫాస్ట్​ బౌలర్​ దొరికినట్టే’ అంటూ సోషల్​మీడియాలో పోస్టులు ప్రత్యక్షమయ్యాయి.