Begin typing your search above and press return to search.

ఆల్‌రౌండ‌ర్ హార్దిక్‌ ఇంట కొత్త సంతోషం

By:  Tupaki Desk   |   30 July 2020 4:00 PM GMT
ఆల్‌రౌండ‌ర్ హార్దిక్‌ ఇంట కొత్త సంతోషం
X
హార్దిక్‌ పాండ్యా....టీమిండియా ఆల్‌రౌండర్‌. క్రికెట‌ర్ హార్థిక్ పాండ్యా ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో ఏదో ఓ పిక్ అప్‌డేట్ చేస్తూనే ఉంటాడు. తాజాగా త‌న సోష‌ల్ మీడియాలో ఖాతాలో ఓ పిక్‌ను పోస్టు చేశాడు. అది మునుప‌టిలా ప్రత్యేక సంద‌ర్భానిది కాదు. పాండ్యా జీవితంలో కొత్త ఆనందం. పాండ్యా‌కు తండ్రిగా ప్రమోషన్‌ వచ్చింది. ఆయ‌న జీవిత భాగ‌స్వామి నటాషా స్టాన్‌కోవిచ్ ఓ ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్ద ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలుపుతూ పాప ఫొటోను పాండ్య సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఈ ఏడాది ఆరంభ వేడుకల్లో సెర్బియా నటి, మోడల్‌ నటాషా తో పాండ్య నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెలిసిందే. నటాషా బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది జ‌న‌వ‌రి ఒక‌టిన‌ ఎంగేజ్మెంట్ చేసుకున్న పాండ్యా...త‌మ‌కు బేబీ పుట్ట‌బోతున్న‌ట్లు మే నెల‌లో ప్ర‌క‌టించాడు. అప్పటి నుంచి భాగస్వామి నటాషా తో తాను గడుపుతున్న క్షణాలను ఫొటోల రూపంలో పాండ్యా సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు. గ‌త వారం కూడా ఈ ఆల్ రౌండర్ నటాషా స్టాంకోవిక్‌ను వెనుకనుంచి కౌగిలించుకోగా ఇద్దరు కలిసి తమ చేతులను నటాషా కడుపు మీద అపురూపంగా పెట్టిన చిత్రాన్ని ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. దీనికి హార్దిక్ 'హార్ట్ విత్ రిబ్బన్' ఎమోజీని శీర్షికగా పెట్టారు.

తాజాగా పాండ్యా ఇంట కొత్త సంతోషం నేప‌థ్యంలో, పలువురు క్రికెటర్లతో పాటు అభిమానులు పాండ్య దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బిడ్డ రాక‌తో పాండ్యా జీవితంలో మ‌రిన్ని అపురూప క్ష‌ణాలు ఉండాల‌ని ప‌లువురు ఆకాంక్షిస్తూ త‌మ శుభాకాంక్ష‌లు తెలియ‌చేశారు. పాండ్యా ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.