Begin typing your search above and press return to search.
త్రిపుర అసెంబ్లీలో తొలిసారి జాతీయగీతాలాపన
By: Tupaki Desk | 25 March 2018 7:33 AM GMTప్రపంచంలో మరే దేశంలో కనిపించని చిత్రమైన అంశాలన్నీ మన దేశంలో కనిపించవేమో? ఏ దేశంలో అయినా దేశ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే విషయంలోనూ.. జాతీయ గీతాన్ని ఆలపించే విషయంలోనూ అభ్యంతరాలు ఉండే పరిస్థితి ఉండదు. ఒకవేళ ఎవరైనా జాతీయ పతాకాన్ని.. గీతాన్ని కించపరిచేలా వ్యవహరిస్తే ఏ సమాజమైనా వ్యతిరేకిస్తుంటుంది.
కానీ.. దేశంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పక తప్పదు. జాతీయ గీతాన్ని.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే విషయంలోనూ కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించని ప్రాంతాల ఉండటం.. వాటి విషయంలో పాలక ప్రభుత్వాలు చూసీచుడటన్లుగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శ ఉంది.
ఎక్కడిదాకానో ఎందుకు త్రిపుర అసెంబ్లీలో తొలిసారిగా జాతీయ గీతాన్ని వినిపించటం దేనికి నిదర్శనం..? కొత్తగా ఎన్నికైన సభ శుక్రవారం సాయంత్రం సమావేశమైంది. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని వినిపించటంతో సభలోని మంత్రులు.. సభ్యులు.. అధికారులు.. సందర్శకులు లేచి నిలబడ్డారు.
అయితే.. ఈ అంశాన్ని అసెంబ్లీ అధికారులు విపక్షాన్ని సంప్రదించకపోవటంపై సీపీఎం సభ్యులు బాదల్ చౌదరీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా.. అసెంబ్లీలో జాతీయ గీతాన్ని ఆలపిస్తామని విపక్షాన్ని సంప్రదించుకొని మాత్రమే వినిపించాలా? ఎంత దారుణమైన మైండ్ సెట్టో కదా?