Begin typing your search above and press return to search.
రాహుల్, సోనియా చట్టానికి అతీతులా ?
By: Tupaki Desk | 13 Jun 2022 8:30 AM GMTనేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధి ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఈరోజు హాజరవుతున్నారు. హెరాల్డ్ ఆస్తులను కారుచౌకగా సోనియాగాంధి, రాహుల్ సొంతం చేసుకున్నారనేది వాళ్ళిద్దరిపైనా ఉన్న అభియోగాలు. బీజేపీ ఎంపీ సుబ్రమణ్యంస్వామి వీళ్ళపై కోర్టులో వేసిన కేసు ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. అనేక సంవత్సరాలు విచారణ జరిగిన తర్వాత తల్లీ, కొడుకుల నిర్వాకాన్ని కోర్టు తప్పుపట్టింది. వీళ్ళకు వ్యతిరేకంగా స్వామి అనేక సాక్ష్యాలను కోర్టు ముందుంచారు.
దాని ఆధారంగానే వీళ్ళిద్దరికీ కోర్టు ఆదేశాలతో ఈడీ విచారణకు హాజరుకావాలని నోటీసులిచ్చింది. ఈడీ నోటీసులివ్వటాన్నే కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. రాహుల్ విచారణకు హాజరయ్యే సమయానికి దేశవ్యాప్తంగా నిరసలు తెలపాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించటమే విచిత్రంగా ఉంది. పైగా రాహుల్ తో పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఎంపీలు, వర్కింగ్ కమిటి సభ్యులు ఏఐసీసీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు.
పార్టీ ఆఫీసునుండి రాహుల్ తో అందరుకలిసి ఈడీ ఆఫీసుకు ర్యాలీగా వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. ఇదంతా చూస్తుంటే ఈడీని ఒత్తిడిలోకి నెట్టే ప్లాన్ జరుగుతోందని అనుమానంగా ఉంది.
ఒకవైపు చట్టంముందు అంతా సమానులే అని చెబుతునే తమకే ఈడీ సమన్లు ఇస్తుందా అంటు మండిపోతున్నారు. తాము చట్టానికి అతీతమని బహుశా సోనియా, రాహుల్ అనుకుంటున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
తాము అధికారంలో ఉన్నకాలంలో కూడా ప్రత్యర్ధులపైకి, తమను థిక్కరించిన వారిపైకి ఇదే దర్యాప్తు సంస్ధలను ప్రయోగించిన విషయాన్ని కాంగ్రెస్ మరచిపోయింది. ఇతరులకు తాము ఏమిచేస్తే తమకు కూడా ఏదోరోజు అదే జరుగుతుందన్న విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు మరచిపోయినట్లున్నారు.
అందుకనే అప్పట్లో విచ్చలవిడిగా ప్రత్యర్ధులపైకి ఉసిగొల్పారు. అయితే ఇపుడు వీళ్ళపైకి అడ్డదిడ్డంగా ఈడీని ఉసిగొల్పలేదు. ఒకపుడు వీళ్ళ నిర్వాకం కారణంగానే ఇపుడు తల్లీ, కొడుకులు కేసులో తగులుకున్నారు. సోనియా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు కాబట్టి విచారణ నుండి తాత్కాలికంగా తప్పించుకున్నారు. కానీ ఏదోరోజు విచారణకు హాజరుకాక తప్పదు.