Begin typing your search above and press return to search.
కేజ్రీవాల్ బాటలో రాహుల్ గాంధీ
By: Tupaki Desk | 10 Dec 2015 11:22 AM GMTనేషనల్ హెరాల్డ్ కేసులో పీకల్దాకా ఇరుక్కుపోయిన తల్లీకొడుకులు ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ఈ కేసులో జైలుకు వెళ్లి జనంలో సింపతీ, హీరోయిజం తెచ్చుకునేందుకు రాహుల్ గాంధీ ఎత్తుగడ వేస్తున్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో జైలుకు వెళ్లడానికి రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారట... కాంగ్రెస్ పార్టీయే ఈ విషయం చెబుతోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 19వ తేదీన కోర్టుకు హాజరైనప్పుడు రాహుల్ జైలుకు వెళ్లడానికి సిద్ధపడతారు కానీ, బెయిల్ తీసుకోరని.. వ్యక్తిగత పూచీకత్తుపై సంతకం కూడా చేయరని కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, రాహుల్ తల్లి సోనియాగాంధీ కూడా అబ్బాయి ఆలోచనకు ఓకే అన్నారట. తాము ఎలాంటి నేరం చేయనందున తమపై సానుభూతి వెళ్లి విరుస్తుందని, ప్రధాని మోడీ తన ప్రత్యర్థులపై కక్ష ఎలా తీర్చుకుంటున్నారనే విషయం కూడా ప్రజలకు అర్థమవుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే... ఇదే కేసులో ఉన్న సోనియా తన ఆరోగ్య పరిస్థితుల రీత్యా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. ఈ కేసులో నిందితులైన 86 ఏళ్ల వయస్సున్న మోతీలాల్ వోరాతో సహా మిగిలిన వారు కూడా బెయిల్ కు దరఖాస్తు చేసుకుంటారట. రాహుల్ ఒక్కరు మాత్రం జైలుకు వెళ్తారు.
కాగా గతంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓ సందర్భంలో ఇలాగే బెయిలు అవకాశం ఉన్నా తీసుకోకుండా రచ్చరచ్చ చేసి జైలుకు వెళ్లారు. ఇప్పుడు రాహుల్ కూడా ఆయన్ను ఆదర్శంగా తీసుకుంటున్నట్లుగా ఉంది.