Begin typing your search above and press return to search.
కోర్టు వద్ద తలాక్...జాతీయ క్రీడాకారిణి షాక్
By: Tupaki Desk | 24 April 2017 6:04 AM GMTతలాక్ విషయంలో అనూహ్యమైన పరిణామం ఒకట చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లో ఓ వ్యక్తి కోర్టు వద్దే తలాక్ చెప్పాడు! ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకోవడంలో సరైన విధానాన్ని పాటించని కారణంగా ఆ విడాకులను రద్దు చేస్తున్నట్టు ఉజ్జయిని ఫ్యామిలీ కోర్టు తీర్పు చెప్పింది. అర్షిఖాన్ అనే మహిళ తన భర్త తౌసిఫ్ వరకట్నం కోసం వేధిస్తున్నాడని కేసు వేసింది. ఈ కేసు విచారణలో ఉండగానే తౌసిఫ్ తన భార్య అర్షిఖాన్ కు కోర్టు ప్రాంగణంలో తలాక్ చెప్పాడు. దీనికి వ్యతిరేకంగా అర్షిఖాన్ కోర్టును ఆశ్రయించింది. తౌసిఫ్ విడాకులు ఇవ్వడానికి సరైన ఆధారాలు చూపకపోవడంతోపాటు షరియా చట్టాల ప్రకారం నడుచుకోని కారణంగా విడాకులను తిరస్కరిస్తున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.
మరో ఉదంతంలో జాతీయ నెట్‌బాల్ చాంపియన్ షామల్యా జావేద్ ట్రిపుల్ తలాక్ బాధితురాలిగా మారారు. ఆడబిడ్డకు జన్మనిచ్చిందనే కారణంతో ఆమె భర్త ఆజం అబ్బాసీ ఆమెకు ఫోన్ లో తలాక్ చెప్పాడు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ - యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు లేఖ రాసినట్టు ఆమె మీడియాకు తెలిపారు.
ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా జిల్లాకు చెందిన షామల్యా జావేద్ కు - లక్నోలోని గోసాయిగంజ్ కు చెందిన ఆజం అబ్బాసీకి 2014లో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమె అత్తమామలు వరకట్నం కోసం తీవ్రం వేధించారు. దీంతో జావేద్ తండ్రి రూ.3 లక్షలు కట్నంగా వారికి ఇచ్చారు. కొద్దిరోజులు బాగానే చూసుకున్న వారు తరువాత మళ్లీ వేధించడం ప్రారంభించారు. ఆమె గర్భవతి అని తెలుసుకుని మగబిడ్డకు జన్మనివ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పుట్టబోయేది ఆడబిడ్డో, మగబిడ్డో తెలుసుకునేందుకు స్కానింగ్ చేయించారు కూడా! ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఇంట్లో నుంచి పంపేశారు. తరువాత ఆడబిడ్డ పుట్టడంతో తన భర్త ఫోన్‌లో తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడని ఆమె వివరించారు. ఈ విషయంలో పోలీసులు, అధికారులు తనకు ఎటువంటి సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ ఈ విధానానికి చరమగీతం పాడి వేల మంది ముస్లిం మహిళలకు అండగా నిలువాలని ఆమె కోరారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/