Begin typing your search above and press return to search.
బాబు బ్యాచ్ తొండాటను చూపించిన టైమ్స్ నౌ
By: Tupaki Desk | 21 March 2018 8:40 AM GMTఏపీకి ప్రత్యేక హోదా కోసం మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ఏపీకి చెందిన అధికార.. విపక్ష నేతలు ఇస్తున్నారు. ఇప్పటికి మూడుసార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వటం.. టీఆర్ ఎస్.. అన్నాడీఎంకే సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లటం ద్వారా సభ సజావుగా సాగని నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లుగా స్పీకర్ చెబుతున్నారు. అందరూ అదే నిజమని అనుకుంటున్నారు.
ఇలాంటివేళ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తొండాటను బయటపెట్టింది జాతీయ న్యూస్ ఛానల్ అయిన టైమ్స్ నౌ. మొదట్నించి రెండు నాల్కుల ధోరణిని ప్రదర్శిస్తారనే విమర్శలు ఎదుర్కొనే చంద్రబాబు.. అందుకు తగ్గట్లే తాజా ఎపిసోడ్ లోనూ వ్యవహరిస్తారన్న నిజం బయటకు వచ్చింది. మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి. తన ఎంపీలతోనే సభను అడ్డుకునే నీచమైన విషయాన్ని సదరు మీడియా సంస్థ తాజాగా బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ను చూపించింది.
సభ ప్రారంభం కాగానే అవిశ్వాస తీర్మానం మీద స్పీకర్ ప్రయత్నం చేయటం.. అంతలోనే ఎంపీలు కొందరు వెల్ లోకి దూసుకొచ్చారు. ఎప్పటిలానే.. అలా దూసుకొచ్చిన ఎంపీలు టీఆర్ ఎస్.. అన్నాడీఎంకేకు చెందిన వారు ఉన్నారని అంతా అనుకున్నారు. అక్కడే ఒక ట్విస్ట్. ఏమిటంటే.. వెల్ లోకి దూసుకెళ్లిన ఎంపీల్లో టీడీపీ ఎంపీలు కూడా ఉండటం. ప్రత్యేక హోదా డిమాండ్ తో పాటు.. చంద్రబాబు ఫోటో ఉన్న ప్లకార్డును పట్టుకొన్న వారు పట్టుకున్న వైనాన్ని టైమ్స్ నౌ ఛానల్ సర్కిల్స్ గీసి మరీ చూపించింది.
ఓపక్క అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చి.. మరోవైపు సభ జరగకుండా అడ్డుకోవటం చూసిన వాళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు. టైమ్స్ నౌ లో ఈ కథనం పబ్లిష్ అయ్యాక.. ఇప్పటివరకూ వెల్ లోకి దూసుకొచ్చినట్లుగా విమర్శలు ఎదుర్కొంటున్న వారిలో తెలుగు తమ్ముళ్లు ఉన్న విషయం బయట పెట్టిన తర్వాత నుంచి దానిపై స్పందించేందుకు తెలుగు తమ్ముళు వెనుకాడటమే కాదు.. తెలుగు మీడియాలోని చాలామంది ఆ విషయం మీద ఎలాంటి వార్తను ఇవ్వకపోవటం గమనించాల్సిన అంశం. ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత నుంచి బాబు బ్యాచ్ మీడియా సంస్థలు కామ్ కావటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.