Begin typing your search above and press return to search.
అత్త కొట్టిందని కాదు.. తోడికోడలు నవ్విందని కోపమా జర్నలిస్టులు?
By: Tupaki Desk | 18 Sep 2020 12:50 PM GMTనిన్నటి నుంచి టీడీపీ అనుకూల చానెల్స్ రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు.. ప్రధానమైన సమస్యలను గాలికి వదిలేసి చూపించిందే చూపించి అటు తిప్పి ఇటు తిప్పి జాతీయ మీడియా జర్నలిస్టులను టార్గెట్ చేశాయి.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆరోజు సాక్షిని నిషేధించాలని ఇవే టీడీపీ చానెల్స్ హంగామా చేశాయి. ప్రభుత్వంతో కలిసి చాలా చోట్ల సాక్షి రాకుండా చేశాయనే విమర్శ ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా తమ మాటే నెగ్గాలని చూస్తుండడమే వింతగా ఉందని జర్నలిస్టు సర్కిల్స్ లో ఓ టాక్ ఉంది.
జాతీయ మీడియా జర్నలిస్టులకు వాళ్ల ఇష్టమైన టాపిక్ మీద ట్వీట్ చేసే హక్కు ఉంది. అదేవిధంగా టీడీపీ అనుకూల చానెల్స్ కు చర్చ పెట్టే హక్కు ఉంది కానీ.. జాతీయ మీడియా జర్నలిస్టులను తిట్టే హక్కు లేదంటున్నారు.
నేషనల్ మీడియా జర్నలిస్టులు ఏదో ట్వీట్ పెడితే అవి టీడీపీ వ్యతిరేకంగా ఉన్నాయని ఇప్పుడు టీడీపీ అనుకూల చానెల్స్ బట్టలు చింపుకుంటున్నారు.. ఇదే చంద్రబాబును ఈ మధ్య కొన్ని జాతీయ మీడియా చానెల్స్ ఇంటర్వ్యూలు చేశాయి. అప్పుడు ఎందుకు విమర్శించలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు... ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడికి విలువ ఇచ్చారని జాతీయ చానెళ్లను నెత్తిన పెట్టుకున్నారా? ఈ చానెల్స్ అని విమర్శిస్తున్నారు.
జర్నలిజం అనేది ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అని టీడీపీ అనుకూల చానెల్స్ కు తెలియదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎవరి అనాలసిస్ వాళ్లదని.. టీడీపీ అనుకూల మీడియా అనాలసిస్ వాళ్లు చేస్తారని.. అలాగే వైసీపీ అనుకూల చానెల్స్ అనాలసిస్ వాళ్లకు అనుకూలంగా ఉంటుందని హితవు పలుకుతున్నారు..
అదే విధంగా సోషల్ మీడియా అనాలసిస్ వాళ్లు చేస్తుంటారని.. ఈ కోవలోనే నేషనల్ మీడియా వాళ్లు ఏదో అన్నారని.. అది టీడీపీకి వ్యతిరేకంగా ఉందని రెండు రోజుల నుంచి చర్చలు పెట్టడం భావ్యమా అని పలువురు దెప్పిపొడుస్తున్నారు. మిమ్మలను మీరు విమర్శించుకుంటున్నారని కొందరు మేధావులు విమర్శిస్తున్నారు.