Begin typing your search above and press return to search.
కేసీఆర్ స్పందించరా..ఏకేసిన జాతీయ మీడియా
By: Tupaki Desk | 1 Dec 2019 10:11 AM GMTదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియాంకరెడ్డి హత్యోదంతం విషయంలో టీఆర్ఎస్ సర్కారు వ్యవహరించిన తీరు, ఇక్కడి పోలీసుల నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఈ దమనకాండపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణ గవర్నర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , జాతీయ మహిళా కమిషన్ ప్రతినిధులు వచ్చి బాధితురాలి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అయితే తెలంగాణకు సీఎం అయిన కేసీఆర్ నుంచి ఏమాత్రం స్పందన.. కనీసం ప్రకటన రాకపోవడం అందరిలోనూ ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఇక ఇటీవలే బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి మహమూద్ అలీ ‘ప్రియాంకరెడ్డి చెల్లెలకు ఫోన్ చేసిందని.. పోలీసులకు ఫోన్ చేయకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని.. ఆమె తప్పుకూడా ఉందని ’ వ్యాఖ్యానించడం దుమారం రేపింది.
తెలంగాణలో జరిగిన ఈ దారుణంపై దేశమంతా స్పందిస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఈ వివాదంసై అస్సలు నోరు మెదపకపోవడాన్ని అందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. దీనిపై తాజాగా జాతీయ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
తాజాగా రిపబ్లిక్ టీవీలో ప్రముఖ జర్నలిస్టు అర్నాబ్ గోస్వామి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రియాంక రెడ్డి హత్యలో స్పందించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దుమ్మెత్తిపోశారు. చర్చలో పాల్గొన్న టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిని కడిగిపారేశారు. గుక్కతిప్పుకోకుండా ప్రశ్నల వర్షం కురించి అతడి పరువు తీశాడు. కనీసం కేసీఆర్ పరామర్శించడానికి కూడా టైం లేదా అంటూ నిలదీశారు. ఎంపీ రంజిత్ రెడ్డి వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేసినా అర్నాబ్ గోసామీ, మహిళ నేతలు ఆయనపై దుమ్మెత్తి పోశారు. కేసీఆర్ తెలంగాణలోనే ఉన్నారా? పాలిస్తున్నారా అని మండిపడ్డారు. ఇలా కేసీఆర్, టీఆర్ఎస్ నేతల వైఖరిని జాతీయ మీడియాలో తీవ్రంగా ఎండగడుతున్నారు.