Begin typing your search above and press return to search.
సీఎం కేసీఆర్ పై ఫైర్ అయిన నేషనల్ మీడియా..ఎందుకంటే!
By: Tupaki Desk | 3 Dec 2019 1:22 PM GMTహైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశ ఉదంతం పై దేశ వ్యాప్తంగా ఇప్పుడు నిరసనలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా ఆ నలుగురు కామాంధులని వెంటనే ఉరి తీయాలని , అలాంటివారికి ఈ భూమిపై బ్రతికే అవకాశం లేదు అంటూ తమ నిరసన తెలియజేస్తున్నారు. దిశా మృతి పై ఇప్పటికే కొంతమంది రాజకీయనేతలు - సినీ ప్రముఖులు - మహిళా కమిషన్ చైర్ పర్సన్ ..ఇలా మరికొంతమంది ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఇకపోతే తాజాగా రెండు రోజుల పర్యటన నిమిత్తం సీఎం కేసీఆర్ ఢిల్లీ కి వెళ్ళారు. దిశా ఉదంతంలో సీఎం కేసీఆర్ కి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లోనే ఊహించని పరాభవం ఎదురైంది.
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుండి బయటకి వస్తున్న సీఎం కేసీఆర్ కి నేషనల్ మీడియా పలు ప్రశ్నలు సంధించింది. ప్రస్తుతం దిశా ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంటే మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు అని ప్రశ్నించారు. దీనితో కేసీఆర్ ఆ మీడియా అడిగిన ప్రశ్న కి సమాధానం చెప్పకుండానే అక్కడి నుండి వెళ్లిపోయారు.
సీఎం కేసీఆర్ ఢిల్లీ లో జరిగే ఒక హై ప్రొఫైల్ పెళ్లి కోసం అయన ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం. ఇకపోతే ఆదివారం ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ దిశా ఘటన పై స్పందించిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదు అని , అలాగే ఇలాంటి ఉదంతాలు మరెక్కడా జరగకుండా చట్టాలను పటిష్ఠం చేయాలని అన్నారు. అలాగే దిశా విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి ..త్వరగా విచారణ జరిపి వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్పిన విషయం తెలిసిందే.