Begin typing your search above and press return to search.

బాబూ..జాగ్రత్త నేషనల్ మీడియాతో పెట్టుకోవద్దు

By:  Tupaki Desk   |   17 Feb 2017 5:00 PM GMT
బాబూ..జాగ్రత్త నేషనల్ మీడియాతో పెట్టుకోవద్దు
X
తెలుగులో మీడియా అధినేతలతో ఉన్న స్నేహాలను, లాలూచీలను, కులాన్ని వాడుకుని కొంత మీడియా మొత్తాన్నీ చంద్రబాబు గుప్పిట్లో పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఏవో ఒకట్రెండు మీడియా సంస్థలు బాబుకు వ్యతిరేకంగా రాసినా వారిని బెదిరించి భయపెట్టి, అవసరమైతే కక్షగట్టి మెడలు వంచే ప్రయత్నాలూ జరిగాయి. చంద్రబాబు విలేకరుల సమావేశాలు పెట్టినా, సభలు నిర్వహించినా మీడియా ప్రతినిధులను బెదిరించినంత పనిచేస్తుంటారు చంద్రబాబు. తనకు నచ్చని మీడియా నుంచి వచ్చినవారిపై సీరియస్ అవుతుంటారు. తమ సంస్థలే చంద్రబాబుకు గులాం చేస్తుంటే తామెందుకు కొట్లాడడం అనుకుంటూ మీడియా ప్రతినిధులు చంద్రబాబును చూసి భయపడుతుంటారు. ఏపీలో ఇలా తనకు నచ్చినట్లు సాగుతుండడంతో దేశమంతా తన మాటే వినాలనుకుంటున్నారో ఏమో కానీ చంద్రబాబు తాజాగా నేషనల్ మీడియాపైనా సీరియస్ అవుతున్నారు. దీంతో.. వాళ్లతో పెట్టుకుంటే చంద్రబాబు పని మటాషే అంటున్నారు నేషనల్ మీడియా పవర్ తెలిసినవారు.

చంద్రబాబు గురించి తెలుగు రాష్ట్రాల్లో మంచీచెడు రెండూ తెలుసు. కానీ.. దేశంలోని మిగతా ప్రాంతాల్లో మాత్రం చంద్రబాబు గురించి మంచి మాత్రమే తెలుసు. నేషనల్ మీడియా కూడా చంద్రబాబుకు మొదటి నుంచి మంచి ప్రయారిటీయే ఇస్తోంది. కానీ.. చంద్రబాబే ఇప్పుడు వారితో కయ్యానికి కాలు దువ్వుతుండడంతో ముందుముందు ఎలా ఉండబోతోందన్నది ప్రశ్నార్థకంగా మారింది.

విలేక‌ర్ల స‌మావేశాల్లో విలేక‌ర్లు ఏమైనా ప్ర‌శ్న‌లు అడిగితే నువ్వే పేప‌రు, ఛాన‌ల్ అంటూ నిల‌దీయ‌డం..మీరు ఫ‌లానా పార్టీకి చెందిన వారు క‌దా..అలాగే మాట్లాడ‌తారు…మీ జెండా ఎజెండా వేరుగా ఉంటాయి.. అంటూ ఆయ‌న ఉన్న‌ట్లుండీ సీరియ‌స్ కావ‌డం అందరికీ తెలిసిందే. అయితేఇంతవరకు ఇలాంటి అనుభవాలు తెలుగు మీడియా ప్రతినిధులకే ఉండేవి. కానీ, మొన్నటి మహిళా పార్లమెంటు తరువాత చంద్రబాబు నేషనల్ మీడియాపైనా మండిపడుతున్నారు.

జాతీయ మీడియాను అమ్ముడుపోయింద‌ని చంద్రబాబు వ్యాఖ్యానించ‌డం పెద్ద దుమారాన్నే రేపుతోంది.స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు మ‌హిళ‌ల ప‌ట్ల చేసిన వ్యాఖ్యానాల‌పై అన్ని స్థాయిల్లోనూ తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్తం అయ్యాయి. దీన్ని జాతీయ మీడియా ప్ర‌ముఖంగా ప్ర‌సారం చేసింది. దీంతో చంద్ర‌బాబు ఫీలయిపోయారు. ఇప్ప‌టివ‌ర‌కూ స్థానికంగా ఉన్న సొంత‌మీడియాను నియంత్రించి, త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకున్న బాబు స్పీక‌ర్ విష‌యాన్ని జాతీయ మీడియా లేవ‌నెత్తే స‌రికి త‌న బండారం ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డుతుందో అని కంగారు ప‌డ్డారు. మీడియా స‌మావేశాన్ని కూడా నిర్వ‌హించి, జాతీయ మీడియా అమ్ముడు పోయింది అని ఆరోపించారు. తాజాగా తెలుగుదేశం పార్టీ నేత‌ల స‌మావేశంలోనే అవే వ్యాఖ్యలు మళ్లీ చేశారు.

తెలుగు మీడియా చంద్రబాబుకు పూర్తిగా అనుకూలంగా మారిపోయినా నేషనల్ మీడియా కనుక చంద్రబాబుకు వ్యతిరేకంగా రాయడం మొదలుపెడితే చంద్రబాబుకు కష్టకాలం మొదలైపోతుంది. నేషనల్ లెవల్లో చంద్రబాబు బండారాన్ని ఇంగ్లీష్ - హిందీ మీడియా కనుక బయటపెట్టడం మొదలు పెడితే సెంట్రల్లోనూ చంద్రబాబు పరువు బజారున పడడంతో పాటు పలుకుబడి కూడా పోతుంది. ఇదంతా ఊహించిన కొందరు సీనియర్లు.. చంద్రబాబును కంట్రోల్ చేశారట. నేషనల్ మీడియా విషయంలో కాస్త స్పీడు తగ్గించాలని సూచించారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/