Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు జాతీయ మీడియా నమ్మట్లేదా?
By: Tupaki Desk | 4 Nov 2022 12:30 PM GMTసుదీర్ఘ రాజకీయ జీవితంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వినని ఒక మాట గురువారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వినిపించింది. ‘నా జీవితంలో భారమైన మనసుతో ప్రెస్ మీట్ పెడుతున్నా’ అంటూ సీఎం కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాట విన్నంతనే కాస్తంత విస్మయానికి గురి కాక మానదు. ఎన్నో ఉద్వేగాల్ని.. భావద్వేగాల్ని చేసిన ఉద్యమ నాయకుడిగా.. రాజకీయ నాయకుడిగా ఆయనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవంలోకేసీఆర్ నోటి నుంచి ఈ తరహా మాట రావటం కాస్తంత అరుదైన విషయంగానే చెప్పాలి. తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల్ని ఎర వేసి.. పార్టీ మార్చేందుకు బీజేపీ తరఫు మధ్యవర్తులుగా పేర్కొనే స్వామీజీల ఆధ్వర్యంలో జరిగిన బేరసారాలకు సంబంధించిన వీడియోను ఆయన విడుదల చేశారు.
దాదాపు గంట నిడివి ఉన్న వీడియోను ప్రెస్ మీట్ కు ముందే.. వివిధ మీడియా హౌస్ లకు.. యూట్యూబ్ చానళ్లకు.. న్యాయమూర్తులకు.. విచారణ సంస్థలకు అప్పజెప్పినట్లుగా చెప్పటం తెలిసిందే. జాతీయ మీడియా సంస్థలకు కూడా తాము ఈ వీడియోలను పంపినట్లుగా కేసీఆర్ చెప్పారు.
సంచలన ప్రెస్ మీట్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. ఆయన అంతలా చెప్పిన తర్వాత జాతీయ మీడియాఈ విషయానికి ఇచ్చిన ప్రాధాన్యత ఎంత? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఇదే విషయాన్ని రెండు రకాలుగా క్రాస్ చెక్ చేసినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. అందులో మొదటిది.. కేసీఆర్ ప్రెస్ మీట్ జరుగుతున్న వేళలోనూ.. జరిగిన గంట తర్వాత దాదాపు ఇంగ్లిషు.. హిందీ.. తమిళం.. మలయాళానికి చెందిన పలు ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన వార్తా వెబ్ సైట్లను చెక్ చేయగా.. అందులో ఒకట్రెండింటిలో తప్పించి.. మిగిలిన వాటిల్లో కేసీఆర్ ప్రెస్ మీట్ కు సంబంధించిన ఎలాంటి కంటెంట్ కనిపించలేదు. రెండో చెక్ లో భాగంగా.. ప్రెస్ మీట్ అయ్యాక.. రెండు గంటల తర్వాత కూడా ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన వెబ్ సైట్లలో కేసీఆర్ ప్రెస్ మీట్ కు చోటు దక్కలేదు.
కట్ చేస్తే.. ఈ రోజున ప్రముఖ ఇంగ్లిషు.. హిందీకి చెందిన దినపత్రికల్లోనూ కేసీఆర్ ప్రెస్ మీట్ కు చోటు దక్కలేదు. ఒకరిద్దరు కవర్ చేసినా.. దానికి తగ్గ కవరేజ్ లభించలేదు. ఎందుకిలా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.ప్రాంతీయ పార్టీగా ఉన్న తన పార్టీని జాతీయ పార్టీగా మార్చిన నేపథ్యంలో.. జాతీయ మీడియాలో కేసీఆర్ కు దక్కాల్సిన ప్రాధాన్యత లభించకపోవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తోపు మీడియా సంస్థలు సైతం కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక.. తెలుగు మీడియా సంస్థల సంగతే తీసుకుంటే.. ఈనాడు ఏపీ ఎడిషన్ లో కేసీఆర్ ప్రెస్ మీట్ కు మొదటి పేజీ ప్రాధాన్యత లభించలేదు. ఇక.. సాక్షి.. ఆంధ్రజ్యోతిలు మాత్రం మొదటిపేజీ కింది భాగంలో కాస్తంత చోటు ఇచ్చారు. యావత్ దేశం మొత్తం మేల్కొని.. మోడీషాల ఆరాచకాలపై కేసీఆర్ గళం విప్పితే.. లభించిన ప్రాధాన్యత ఇంత తక్కువా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది. ఇదంతా చూస్తే.. కేసీఆర్ కు ఇచ్చే ప్రాధాన్యత ఇంత తక్కువా? అన్న సందేహం కలుగక మానదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.