Begin typing your search above and press return to search.
ఆ పార్టీల నేతలు బాబు ఉచ్చులో చిక్కుకున్నారా..?
By: Tupaki Desk | 12 Feb 2019 6:43 AM GMTతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఉచ్చులో వివిధ పార్టీల నేతలు చిక్కుకున్నారనే కామెంట్ వినిపిస్తోందిప్పుడు. చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రజల సొమ్ముతో నిర్వహించిన దీక్షకు వివిధ పార్టీ నేతలు హాజరయ్యారు. వీరందరినీ అక్కడకు రప్పించింది చంద్రబాబు కాదు… మోడీ మీద వ్యతిరేకత… ఆ వ్యతిరేకతతోనే చంద్రబాబు నాయుడు మోడీని తిడుతున్నాడు కాబట్టి.. వాళ్లంతా అక్కడకు వచ్చారు. వచ్చిన వారు మోడీని తిట్టారు.
అయితే ప్రత్యేకహోదా వంటి అంశం గురించి చంద్రబాబు నాయుడు మాట మార్చిన విధానం ఆయా పార్టీల వాళ్లకు తెలుసో లేదో కానీ.. ప్రజలకు - మీడియాకు మాత్రం బాగా తెలుసు. బీజేపీతో కలిసి సాగినన్ని రోజులూ చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్రత్యేకహోదా వద్దు.. అనే అన్నాడు. హోదాతో ఏమీ రాదన్నాడు. హోదా వల్ల లాభం లేదన్నాడు. బీజేపీ మేలు చేస్తోందన్నాడు. మోడీ గొప్ప నేతగా చెప్పాడు. నోట్ల రద్దు గొప్ప చర్యఅన్నాడు. మోడీ మళ్లీ ప్రధాని కావాలని అప్పట్లో చంద్రబాబు నాయుడు తీర్మానం సైతం పెట్టాడు.
అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నింటికీ మోడీని తిడుతున్నాడు. తను గతంలో ప్రశంసించిన వ్యవహారాల్లోనే ఇప్పుడు మోడీని తిడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఇలా ఒక పచ్చి అవకాశవాదిగా ప్రవర్తిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ విషయం ప్రజలకు తెలుసు.
అప్పుడు మోడీకి జై కొట్టిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే మోడీని ఛీ కొడుతున్నాడనేది జనాలకు బాగా తెలిసిన విషయం. బాబులోని ఈ అవకాశవాదం ప్రజలందరికీ అర్థం అయిపోయింది. ఇలాంటి బాబుతో చేతులు కలుపుతూ ఆయా పార్టీల నేతలు కూడా పలుచన అవుతున్నారు.
చంద్రబాబు నాయుడు వంటి అవకాశవాది రాజకీయాలను నమ్మి వారు కూడా ఉచ్చులో చిక్కుకుంటున్నారని.. రేపు కేంద్రంలో మళ్లీ బీజేపీ సర్కారు వస్తే చంద్రబాబు నాయుడు మళ్లీ మోడీ భజన చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని.. చంద్రబాబు కు అలాంటి అవకాశవాదం అలవాటే అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.