Begin typing your search above and press return to search.
ఇక, ప్రచార హోరు.. కేసీఆర్ పక్కా ప్లాన్!!
By: Tupaki Desk | 3 Oct 2022 11:30 PM GMTదసరా రోజు.. కొత్త పార్టీని ప్రకటించాలని నిర్ణయించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇదేదో.. చప్పగా సాగేలా కాదు.. దేశవ్యా ప్తంగా ఠారెత్తేలా.. వ్యూహ రచన చేశారు. అంటే.. దేశంలో ఆయన పెట్టనున్న జాతీయ పార్టీ పేరుపై.. చర్చలు.. వార్తలు.. విశ్లేషణ లు ఇలా..ఒక్కటేమిటి.. అన్ని రూపాల్లోనూ.. చర్చ జరిగేలా వ్యూహాత్మకంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. వాస్తవానికి తెలుగు నేల నుంచి జాతీయ స్థాయిలో మెరుస్తున్న నేతగా.. కేసీఆర్ గుర్తింపు తెచ్చుకున్నారు. నిజానికి గతంలో చంద్రబాబు, ఎన్టీఆర్ కూడా.. జాతీయ స్తాయిలో చక్రాలు తిప్పారు.
అయితే.. వీరికి భిన్నంగా.. ఏకంగా.. ఒక జాతీయ పార్టీనే స్థాపిస్తున్న చరిత్రను కేసీఆర్ సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తన జాతీయ పార్టీకి అదే రేంజ్‌లో ప్రచారం కల్పించాలని.. కేసీఆర్ నిర్ణయించుకున్నారు. దీనికి అనుసరించనున్న వ్యూహాన్ని కూడా.. ఆయన సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి.. తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వెళ్లే వారికి.. భాషా పరమైన సమస్య ఉంది. దీనిని అధిగమించేందుకు కేసీఆర్ కొత్తగా రెండు టీవీ ఛానళ్లను ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, జాతీయ స్థాయిలో మేధావులును ఆకర్షించేలా.. కూడా.. ఇవి పనిచేయనున్నాయి.
ఒకటి ఇంగ్లీష్, మరొకటి హిందీ చానల్‌ను కేసీఆర్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేశారని అంటున్నారు. ఈ రెండు చానళ్లు కూడా.. ఢిల్లీ కేంద్రంగానే పనిచేయనున్నాయి. అక్కడ నుంచి కేసీఆర్ పార్టీపై చర్చలు, ప్రసారాలు ప్రారంభిస్తాయి.
ఇది జాతీయ స్తాయిలో ఎన్డీ టీవీ స్థాయిలో ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. కేవలం ప్రాంతీయ భాషా చానెళ్లను నమ్ముకుంటే.. ప్రజల్లోకి వెళ్లడం కష్టమవుతుందనేది అందరికీ తెలిసిందే. అందుకే.. జాతీయ స్తాయిలో మెరవాలంటే.. ఖచ్చితంగా ప్రచారం జరగాల్సిందేనని.. కేసీఆర్ నమ్ముతున్నారు.
గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కేసీఆర్ మీడియాకు అత్యధికప్రాధాన్యం ఇచ్చి.. ప్రజల్లోకి వెళ్లేలా వ్యవహరించారు. దీంతో తక్కువ కాలంలోనే.. తెలంగాణ ఉద్యమం.. జాతీయస్తాయిలో చర్చకు వచ్చింది. ఇప్పుడు జాతీయ పార్టీ విషయంపైనా.. ఆయన అదే రేంజ్‌లో వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇక, దసరా రోజే వీటిని ప్రారంభిస్తారా.. లేక కొంత గడువు ఉంటుందా.. అనేది చూడాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.