Begin typing your search above and press return to search.

జాతీయ రాజకీయాలు.. కేసీఆర్ కు అంత ఈజీ కాదు!

By:  Tupaki Desk   |   23 July 2022 2:30 AM GMT
జాతీయ రాజకీయాలు.. కేసీఆర్ కు అంత ఈజీ కాదు!
X
రాష్ట్రపతి ఎన్నికలతో కేసీఆర్ కు తత్త్వం బోధపడింది. కాంగ్రెస్ బలపరిచిన విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తాజాగా జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఆయనకు సొంత ప్రతిపక్షాలు వెన్నుపోటు పొడిచాయని అంటున్నారు. హైదరాబాద్ కు తీసుకొచ్చి మరీ యశ్వంత్ సిన్హాకు పెద్దపీట వేశాడు కేసీఆర్. బిజేపిని తిట్టి ఆ పార్టీని ఓడిస్తానని శపథం చేశారు.

కానీ ఇప్పుడు ఎన్నికల్లో అది నెరవేరలేదు. కాంగ్రెస్ అంటేనే గిట్టని కేసీఆర్ బీజేపీపై కోపంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చారు. అయినా కూడా ఆయన గెలవకపోవడంతో ఇప్పుడు ఆయన నోట్లో పచ్చివెలక్కాయపడ్డట్టు అయ్యింది. దీంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక పరిస్థితి నెలకొంది.

కేసీఆర్ జాతీయ రాజకీయాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. మొన్నటి వరకు టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మారుస్తారని అన్నారు. కానీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలనుకున్న కేసీఆర్ ముందే ఎంట్రీ ఇచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో పాలు పంచుకునేందుకు ప్రత్యేకంగా యశ్వంత్ సిన్హా ఎపిసోడ్ ను వాడుకోవాలనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు.

కేసీఆర్ అనుకున్నట్టు బీజేపీ ఉమ్మడి అభ్యర్థికి తక్కువ మెజారిటీతో విజయం సాధించేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే అందివచ్చిన ప్రతి ఒక్కరితోనూ కేసీఆర్ ముందుకు సాగారు. అసలు కాంగ్రెస్ పొడ కూడా గిట్టని కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికల్లో జాతీయ స్థాయిలో అన్నీ సర్దుకున్నా ఆయన ఆకాంక్ష నెరవేరలేదు. బీజేపీ అభ్యర్థి ముర్ము గెలవడంతో కేసీఆర్ కు మింగుడుపడడం లేదు.

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ కు ఇప్పుడు అవి నెరవేరేలా లేవు. అలా కుదిరేలా లేవు. నాయకులకు, భరోసా ఇవ్వాలి. ఇది అంత తేలికైన విషయం అయితే కాదని అనుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాలను ఏలుతున్న కేసీఆర్ కు జాతీయ రాజకీయాలు అంత ఈజీ కావని అర్థమైంది. డిఫెరెంట్ మనుషులు, దేశంలోని మనుషుల వ్యక్తిత్వాలను మేనేజ్ చేయడం సాధ్యం కాదని తెలిసివచ్చింది.

రాష్ట్రపతి ఎన్నికల విజయంతో మోడీ సహా కేంద్రంలోని బీజేపీకి మరింత జోష్ వచ్చినట్టైంది. తాము వేస్తున్న వ్యూహాలు సక్సెస్ కావడం.. విపక్షాల మధ్య అనైక్యత.. వంటివి ఆ పార్టీకి పెట్టని కోటగా మారిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో నెగ్గుకురావడం.. అనేది కేసీఆర్ ఈజీ కాదని అర్థమైంది.